Waste collection equipment వృథాగా చెత్త సేకరణ పరికరాలు
ABN , Publish Date - Jun 09 , 2024 | 12:33 AM
మండలకేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో చెత్తను సేకరించే పరికరాలు, యంత్రాలు మూలనపడి తుప్పు పడుతున్నాయి. గతంలో చెత్తతో సంపద సృష్టించే కేంద్రాలకు చెత్తను సేకరించేందుకు గాను ట్రాక్టర్‌తో పాటు రిక్షాలు తదితర పరికరాలు వాడేవారు.
నల్లమాడ, జూన 8: మండలకేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో చెత్తను సేకరించే పరికరాలు, యంత్రాలు మూలనపడి తుప్పు పడుతున్నాయి. గతంలో చెత్తతో సంపద సృష్టించే కేంద్రాలకు చెత్తను సేకరించేందుకు గాను ట్రాక్టర్‌తో పాటు రిక్షాలు తదితర పరికరాలు వాడేవారు.
అయితే కొన్నేళ్లుగా చెత్తతో సంపద సృష్టించే కేంద్రాలు ఉపయోగంలో లేవని, దీంతో వాటి పరికరాలు మొత్తం వృథాగా ఉండి తుప్పు పడుతున్నాయని ప్రజలు అంటున్నారు. పంచాయతీ కార్యాలయంలో ఓ మూలకు చెల్లచెదురుగా దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు. దీంతో ప్రజాధనం వృథా అయిందని చర్చించుకుంటున్నారు. అధికారులు స్పందించి పరికరాలు ఉపయోగంలోకి తేవాలని వారు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...