WELFARE : సంక్షేమం తిరిగొచ్చేనా?
ABN, Publish Date - Jun 19 , 2024 | 12:22 AM
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో సంక్షేమ వసతిగృహాలకు మంచిరోజులు వచ్చినట్లేనని పలువురు పేర్కొంటున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమ వసతిగృహాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. మెయినటెనెన్స ఫండ్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఒక్క భవనాన్ని నిర్మించకపోగా... ఉన్న వాటిని శిథిలావస్థకు చేర్చేసింది. వసతిగృహాల్లో కనీస మౌలిక వసతులు కల్పనను పెడ చెవిన పెట్టింది. దీంతో వసతి గృహాల్లో ఉండే పేద విద్యార్థులు బిక్కుబిక్కు మంటూ ఐదేళ్లు గడిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి ...
వైసీపీ పాలనలో సంక్షోభంలో సంక్షేమ వసతిగృహాలు
శిథిలావస్థలో కొన్ని... సమస్యల నడుమ మరిన్ని..
అసౌకర్యాలు, అభద్రత మధ్య అల్లాడుతున్న విద్యార్థులు
కూటమి ప్రభుత్వం రాకతో చిగురిస్తున్న ఆశలు
(అనంతపురం ప్రెస్‌క్లబ్)
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో సంక్షేమ వసతిగృహాలకు మంచిరోజులు వచ్చినట్లేనని పలువురు పేర్కొంటున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమ వసతిగృహాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. మెయినటెనెన్స ఫండ్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఒక్క భవనాన్ని నిర్మించకపోగా... ఉన్న వాటిని శిథిలావస్థకు చేర్చేసింది. వసతిగృహాల్లో కనీస మౌలిక వసతులు కల్పనను పెడ చెవిన పెట్టింది. దీంతో వసతి గృహాల్లో ఉండే పేద విద్యార్థులు బిక్కుబిక్కు మంటూ ఐదేళ్లు గడిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వసతిగృహాల్లోని విద్యార్థులతో పాటు... ఆయా సంక్షేమశాఖల అధికారుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో టీడీపీ అధికారంలో
ఉన్నప్పుడు సంక్షేమ వసతిగృహాల అభివృద్ధికి పెద్ద పీట వేసింది. ప్రతి సంక్షేమ వసతిగృహానికి మెయింటెనెన్స ఫండ్స్ విడుదల చేసింది. వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించింది. విద్యార్థులకు వైద్యపరీక్షలు చేయించి, నాణ్యమైన భోజనం అందించింది. ఎప్పటికప్పుడు భవనాలకు మరమ్మతులు చేయించింది. ఇప్పుడు కూడా అవన్నీ యథాతథంగా అమలు చేస్తుందని కూటమి ప్రభుత్వంపై విద్యార్థులు, అధికారులు, వార్డెన్లు ఆశలు పెట్టుకున్నారు.
భయం గుప్పిట్లో విద్యార్థులు
జిల్లాలో సగానికిపైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వసతిగృహాలు సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నాయి. పలు వసతిగృహాలు పాతబడటంతో గదుల్లోని స్లాబ్‌లు పెచ్చులూడిపోతున్నాయి. దీనికి తోడు గోడలు నెమ్ము ఎక్కుతుండటంతో ఎప్పుడు కూలుతాయోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చిన్నపాటి వర్షాలు కురిస్తేనే పలు వసతిగృహాల్లో స్లాబ్‌ల నుంచి నీరు కారుతోంది. దీంతో ఉన్న గదుల్లోకే విద్యార్థులు ఇరుకిరుకుగా వసతి పొందుతున్నారు. చాలా
వసతిగృహాల మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా రు. బయటి నుంచి బకెట్లలో నీరు తెచ్చుకొని హాస్టల్ ఆవరణలో స్నానాలు చేస్తున్నారు. బహిర్భూమికి హాస్టల్ వెలుపలి ప్రాంతాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో బయటికెళితే ఏ పురుగు పుట్ర బారిన పడాల్సి వస్తుందోనని ఆయా వసతిగృహాల్లోని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో వసతిగృహాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
- రాప్తాడు మండలం హంపాపురం బీసీ బాలుర వసతిగృహంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. వసతిగృహానికి ప్రహరీ లేదు. ఆవరణలోనే పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు పెరిగిపోయాయి. దీనికితోడు చుట్టుపక్కల ఉన్నవారు అక్కడ చెత్తాచెదారాన్ని వేస్తుండటంతో అందులో నుంచి విషపురుగులు సంచరిస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.
- శింగనమల ఎస్సీ బాలుర వసతిగృహంలో విద్యార్థులకు మరుగుదొడ్లు కరువయ్యాయి. నీటి సౌకర్యం లేకపోవడంతో ఆ మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. దీంతో కొందరు ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. బహిర్భూమి కోసం విద్యార్థులు బయటిప్రాంతాలకు వెళ్తున్నారు.
- గుత్తి మండలం ఇసురాళ్లపల్లి బీసీ వసతి గృహంలో గదుల పెకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. భవనం శిథిలావస్థకు చేరుకుంది. ప్రహరీ చుట్టూ సగానికి పడిపోయింది. దీంతో వార్డెనే బండలు నాటించారు. వసతిగృహంలో దాదాపు మూడు గదుల్లో చిన్నపాటి వర్షానికే స్లాబులు నెమ్ము ఎక్కి నీరంతా గదుల్లోకి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విద్యార్థులు హాస్టల్‌లో ఉన్న రెండుమూడు గదుల్లోనే ఇరుకిరుకుగా వసతి పొందుతున్నారు.
-గుత్తిలో కొండకింద ఉన్న బీసీ బాలుర వసతిగృహం భవనం ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు భయపడుతున్నారు. ప్రహరీ లేకపోవడంతో పందులు హాస్టల్ ఆవరణలోకి వస్తున్నాయి. ఒకటి, రెండు గదులు మినహా... మొత్తం గదులన్నీ శిథిలమయ్యాయి. చిన్నపాటి వర్షానికే నీరంతా గదుల్లోకి వస్తోందని, అందుకే వర్షం వస్తే అందరూ కలిసి ఉన్న గదుల్లోనే వసతి పొందుతున్నట్లు సమాచారం.
- బెళుగుప్పలోని బీసీ బాలుర వసతి గృహంలో నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకున్నాయి. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం బయటి పరిసర ప్రాంతాలకు వెళ్తున్నట్లు సమాచారం.
- జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల నెం-2 వసతిగృహ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఆ వసతిగృహంలో మూడు గదులు దెబ్బతిన్నాయి. స్లాబ్ పెచ్చులూడిపోయాయి. దీంతో ఉన్న గదుల్లోనే విద్యార్థులు వసతి పొందుతున్నారు. మరమ్మతులకు సంబంధించి నివేదికలు పంపినప్పటికీ చర్యలు శూన్యం.
ఫ నగరంలోని గిల్డాఫ్ సర్వీస్ స్కూల్ పక్కనున్న బీసీ నెం-1, నెం-2, ఎస్సీ బాలికల స్కూల్, కాలేజీ హాస్టళ్ల సముదాయ వసతిగృ ప్రహరీ కూలిపోయింది. తిరిగి నిర్మించకపోవడంతో రాత్రి సమయాల్లో భద్రత సమస్య ఏర్పడుతోంది. పడిపోయిన గోడ స్థానంలో వార్డెన్లు రేకులు అడ్డుగా పెట్టించారు. అయినా విద్యార్థినులు భయాందోళనల మధ్యనే వసతి పొందుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 19 , 2024 | 12:26 AM