CM Revanth - Kodali Nani: సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నానీ హాట్ కామెంట్స్
ABN, Publish Date - Jan 08 , 2024 | 08:26 PM
ఇటీవల ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘బిగ్ డిబేట్’ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగానైనా ఫోన్ చేయలేదని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ కామెంట్స్‌పై మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి, తాడేపల్లి: ఇటీవల ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘బిగ్ డిబేట్’ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగానైనా ఫోన్ చేయలేదని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ కామెంట్స్‌పై మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘రేవంత్ రెడ్డికు సీఎం జగన్ ఫోన్ చేయకపోతే ఎంటి?’’ అని నాని ప్రశ్నించారు. జగన్ ట్విట్టర్ ద్వారా రేవంత్ రెడ్డికి విషెస్ అన్నారు. తాను రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరలేదన్నారు. ‘‘ మాకు మా ముఖ్యమంత్రిని కలవడానికి సమయం సరిపోవడం లేదు. నాకు రేవంత్ అపాయింట్‌మెంట్ కావాలంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలిసి చెపితే చాలు. రేవంత్ అపాయింట్‌మెంట్ లభిస్తుంది. ఆయనది మా మాదిరిగా ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయపార్టీ. ఆయనేమో దానిలో సుప్రీం కాదు. కేసీఆర్‌కు తుంటి ఎముక విరిగింది అని మా సీఎం కలిశారు. రేవంత్ రెడ్డికి ఏమైనా తుంటి ఎముక విరిగిందా వెళ్లి కలవడానికి?’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఏపీలో షర్మిలకు సపోర్ట్ ఇవ్వడం కాదు.. ఏపీలో కూడా పీసీసీ అధ్యక్షుడు అయ్యి రేవంత్ ఇక్కడ ప్రచారం చేసుకోవచ్చని అన్నారు.
Updated Date - Jan 08 , 2024 | 08:28 PM