Share News

పర్యాటకుల గమ్యస్థానంగా ఏపీ

ABN , Publish Date - Nov 23 , 2024 | 04:50 AM

రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకుల గమ్యస్థానంగా మారుస్తామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ చెప్పారు.

పర్యాటకుల గమ్యస్థానంగా ఏపీ

త్వరలో టూరిజం క్యాలెండర్‌: మంత్రి కందుల దుర్గేష్‌

అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకుల గమ్యస్థానంగా మారుస్తామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ చెప్పారు. టూరిజం పాలసీపై శుక్రవారం శాసనసభలో మంత్రి ప్రకటన చేశారు. 2024-29 పాలసీతో దేశంలోని టాప్‌-10 రాష్ర్టాల్లో ఏపీ ఒకటిగా నిలుస్తుందన్నా రు. పర్యాటకం ద్వారా ఉపాధి అవకాశాలు 15 శాతం పెరుగుతాయని వివరించా రు. పీపీపీ విధానంలో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామని, ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు వస్తాయని అన్నారు. త్వరలో టూరిజం క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారు. కాగా, ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్‌ సిటీని నిర్మించబోతున్నట్లు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. డ్రోన్‌ టెక్నాలజీవల్ల 40వేల మందికి ఉద్యోగాలు, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు. వైసీపీ ప్రభుత్వం క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, పైగా ఆడుదాం ఆంధ్రా పేరుతో దోచుకున్నారని క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఒక్క పులివెందులలోనే రూ.20 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడల కోటాను 3 శాతానికి పెంచామని తెలిపారు. క్రీడల్లో పేరు తెచ్చిన వారికి ‘స్వర్ణాంధ్ర క్రీడ’ బిరుదు ఇస్తామన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 04:50 AM