ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu: పోలవరం ప్రాజెక్ట్ విధ్వంసం.. వెలుగు చూస్తున్న వాస్తవాలు

ABN, Publish Date - Jun 18 , 2024 | 06:47 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌పై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమీక్షా సమావేశంలో ఈ అయిదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ విధ్వంసంలో అసలు సిసలు వాస్తవాలు వెలుగు చూసినట్లు తెలుస్తుంది.

అమరావతి, జూన్ 18: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌పై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమీక్షా సమావేశంలో ఈ అయిదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ విధ్వంసంలో అసలు సిసలు వాస్తవాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. డయాఫ్రం వాల్ కొట్టుకు పోవడానికి గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలే కారణమని అధికారులు ఈ సమీక్షా సమావేశంలో అంగీకరించినట్లు సమాచారం. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టర్‌ను మార్చడంతోపాటు ప్రాజెక్టు స్థితిగతులపై పూర్తి అవగాహనున్న అధికారులను సైతం మార్చడంతోనే ఈ తరహా ఇబ్బందులు ఎదురైయ్యాయని అధికారులు ఒప్పుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి

Also Read: ఎంపీగా ప్రియాంక గాంధీ పోటీ.. స్పందించిన రాబర్ట్ వాద్రా


మౌనం అంతే..!

అలాగే అనాలోచిత నిర్ణయాలతో వరదల సమయంలో ప్రాజెక్టుపై పర్యవేక్షణ లేకుండా పోయిందని అధికారులు స్పష్టం చేశారు. అయితే భారీ ప్రాజెక్టు విషయంలో ఇంత అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటుంటే ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఉన్నతాధికారులను చంద్రబాబు ప్రశ్నించగా.. అందుకు వారంతా మౌనంగా ఉండిపోయారట. అదే విధంగా ఈ సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు వేసిన పలు సూటి ప్రశ్నలకు ఉన్నతాధికారుల నుంచి మౌనమే సమాధానమైనట్లు సమాచారం. దీంతో ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనేక అంశాలపై లోతుగా చర్చించాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. ఇక సివిల్ వర్క్స్, హెడ్ వర్క్స్, కుడి, ఎడమ కాలువల పనుల్లో గత అయిదేళ్లుగా పురోగతి కనిపించ లేదు.

Also Read: బాలాసోర్‌లో ఉద్రిక్తత.. కర్ఫ్యూ విధింపు


ఏదీ పురోగతి..?

2019 అనంతరం కనీసం 4 శాతం పనులు కూడా పూర్తి కాలేదనే విషయం ఈ సమీక్షా సమావేశంలో స్పష్టమైందట. ఇక ప్రాజెక్ట్ నిర్వాసితులకు పునరావాసం విషయంలోనూ కనీస హామీలను సైతం గత ప్రభుత్వం నెరవేర్చ లేదని తేలింది. గత జగన్ ప్రభుత్వ ఘోర తప్పిదాల కారణంగా.. సాంకేతికంగా, ఆర్థికంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కష్టాల్లోకి వెళ్లిందనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అలాగే నిర్వాసితులకు పరిహారం, కాలనీ నిర్మాణంలోను ఎక్కడా పురోగతి కనిపించ లేదని స్పష్టమైంది.

Also Read: West Bengal: బీజేపీ అగ్రనేతల బృందంపై సొంత పార్టీ కేడర్ గరం గరం

మరోవైపు ఫేజ్ వన్‌లో భాగంగా ప్రాజెక్టు నిర్మాణం, పరిహారం, పునరావాసం కోసం ఇంకా రూ.12157 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తేల్చారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాంల పునరుద్దరణకు మరో రూ. 2 నుంచి 4 వేల కోట్ల ఖర్చు కావ్వొచ్చని ఉన్నతాధికారులు అంచనా వేశారు. ఈ వ్యవస్థలను పునరుద్దరించేందుకు నాలుగేళ్లకు పైగా సమయం పడుతుందని అధికారులు అంచనాకొచ్చారు. వైయస్ జగన్ ప్రభుత్వ తప్పిదాలు, ప్రణాళికా లోపం, కక్ష సాధింపు విధానాలకు పోలవరం ప్రాజెక్టు బలైందని వాదన సైతం ఈ సందర్బంగా వినిపిస్తోంది.

త్వరలో ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి స్థాయి సమీక్షతో అన్ని వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలనే చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ క్రమంలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతీ అంశాన్నిపారదర్శకంగా వ్యవహరించి.. అన్ని అంశాలను ప్రజలకు తెలియజేసేందుకు ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Read Latest Telangana News and National News

Updated Date - Jun 18 , 2024 | 07:44 PM

Advertising
Advertising