Share News

AP Politics: టిడ్కో ఇళ్ల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Nov 28 , 2024 | 07:51 PM

చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం గత ప్రభుత్వ హాయంలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణకు రంగం సిద్ధం చేసింది. అందులోభాగంగా టిడ్కో ఇళ్లపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసి.. మాసం రోజుల్లో విచారణ జరిపి నివేదిక అందజేయాలంటూ జారీ చేసిన ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

AP Politics: టిడ్కో ఇళ్ల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
AP Minister P. Narayana

అమరావతి,నవంబర్ 28: గత జగన్ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల వ్యవహారంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలపై విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దర్యాప్తు నివేదికను నెల రోజుల్లో అందజేయాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

Also Read : బొద్దింక బిర్యానీ.. హైదరాబాద్‌లో కలకలం


అయితే 2019 నుంచి 24 మధ్య టిడ్కో ఇళ్ల లబ్దిదారుల జాబితా మార్చివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో.. అంటే 2017-19 లో ఎంపిక చేసిన లబ్దిదారులను మార్చేసి 2019 - 24లో కొత్తవారిని ఆ జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద లబ్దిదారుల డీడీలను బ్యాంకుల్లో సైతం సమర్పించక పోవటంపై కూడా విచారణ చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Also Read : ఆగిన విశాఖ ఉక్కు ఉద్యోగుల జీతాలు..చొరవ తీసుకున్న ఎంపీ


అయితే గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయిస్తామని ఇప్పటికే అసెంబ్లీలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో విచారణ కమిటీలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్, మెప్మా మిషన్ డైరెక్టర్, ఏపీ టిడ్కో ఎండీల ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. టిడ్కో ఇళ్ల లబ్దిదారుల జాబితాను మార్చివేసిన వ్యవహారంతో పాటు బ్యాంకు డీడీల గోల్ మాల్ పైనా విచారణ చేయాలని కమిటీకి జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్

Also Read: ఆందోళన వద్దంటూ రైతులకు కీలక సూచన


గత ప్రభుత్వ హయాంలో ప్రతి అంశంలో అవినీతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. చివరకు టిడ్కో ఇళ్లలో సైతం భారీా అవినీతి చోటు చేసుకుందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంకా చెప్పాలంటే.. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి టీడీపీ ప్రభుత్వం రూపొందించిన లబ్ది దారులు జాబితాను సైతం తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే.. నాటి జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన వారికి ఆయా జాబితాలో చోటు కల్పించినట్లు ఓ ప్రచారం అయితే జోరుగా సాగింది.

Also Read: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం

Also Read: ఆ ప్రాంతాల్లో తుఫాన్.. రెడ్ అలర్ట్ జారీ


ఇక చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం గత ప్రభుత్వ హాయంలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణకు రంగం సిద్ధం చేసింది. అందులోభాగంగా టిడ్కో ఇళ్లపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసి.. మాసం రోజుల్లో విచారణ జరిపి నివేదిక అందజేయాలంటూ జారీ చేసిన ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 28 , 2024 | 07:51 PM