AP Politics: వైఎస్ జగన్‌కు సత్యకుమార్ సవాల్
ABN, Publish Date - Nov 28 , 2024 | 08:15 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో ప్రెస్ మీట్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వాటిపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తనదైనశైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అమరావతి, నవంబర్ 28: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో అధికారం లేదన్న నిరాశ స్పష్టంగా కనిపిస్తుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. గురువారం తాడేపల్లిలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Also Read: టిడ్కో ఇళ్ల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
తన ప్రభుత్వ హయాంలో ఆరోగ్య రంగంలో 52 వేల మందిని నియమించామంటూ వైఎస్ జగన్ ప్రకటన చేయడం పచ్చి అబద్దమని ఆయన పేర్కొన్నారు. ఓ వేళ.. ఇది నిజమని నిరూపిస్తే.. తాను బహిరంగ క్షమాణలు చెబుతానంటూ వైఎస్ జగన్‌కు ఈ సందర్బంగా ఆయన సవాల్ విసిరారు.
Also Read : బొద్దింక బిర్యానీ.. హైదరాబాద్‌లో కలకలం
ఇక సూపర్ స్పెషాలటీ వైద్యుల కొరత 4 శాతం మేర మాత్రమే ఉందని వైఎస్ జగన్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది ఆయన హయాం నుంచి 59 శాతంగా ఉందని గుర్తు చేశారు. ఎన్నికల్లో తనను ఓడించినందుకు ప్రజలను నిందించడం ఇప్పటికీ వైఎస్ జగన్ మానుకో లేదన్నారు.
Also Read : ఆగిన విశాఖ ఉక్కు ఉద్యోగుల జీతాలు..చొరవ తీసుకున్న ఎంపీ
ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి ప్రజలు ఇచ్చిన ప్రజాస్వామ్య తీర్పును నిందించడం ఏమిటంటూ? వైఎస్ జగన్‌ను మంత్రి సత్యకుమార్ సూటిగా ప్రశ్నించారు.
Also Read: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్
గురువారం ప్రెస్ మీట్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం లిక్కర్, సాండ్ మాఫియా నడుస్తుందన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో మైనింగ్ చేపట్టాలన్నా.. ఎమ్మెల్యేకు ఇంత.. సీఎం చంద్రబాబు ఇంతా అన్నట్లుగా పరిస్థితి తయారైందన్నారు. ఇంకా చెప్పాలంటే..ఏపీలో ఓ మాఫియా సామ్రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం తిరోగామి పథంలో పయనిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: ఆందోళన వద్దంటూ రైతులకు కీలక సూచన
అయితే తమ ప్రభుత్వ హయాంలో తీసుకు వచ్చిన సంస్కరణలు నీరుగారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. గతంలో లేని విప్లవాత్మక మార్పులకు తమ ప్రభుత్వ హయాంలో తీసుక వచ్చామని గుర్తు చేశారు. అలాగే గొప్ప మార్పులు సైతం తీసుకు వచ్చామన్నారు. గతంలో తన పాదయాత్ర సందర్బంగా తెలుసుకున్న అంశాలను తన ప్రభుత్వ హయాంలో అమలు చేశామని చెప్పారు. ఆ క్రమంలో ప్రతి రంగంలో మార్పులు, చేర్పులు చేశామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అలాగే తన ప్రభుత్వ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలకు.. ప్రస్తుత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాల విషయంలో చాలా తేడా ఉందని వైఎస్ జగన్ సోదాహరణగా వివరించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ పై విధంగా స్పందించారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Nov 28 , 2024 | 08:34 PM