ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sharmila : అప్పుడు సంతకం చేసి ఇప్పుడు బెయిల్‌ కథలా?

ABN, Publish Date - Oct 31 , 2024 | 05:13 AM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేసేందుకు కుట్ర చేశామనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్‌గా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అభివర్ణించారు.

రద్దుకు కుట్ర అనడం శతాబ్దపు పెద్ద జోక్‌ జగన్‌పై షర్మిల ఫైర్‌

అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేసేందుకు కుట్ర చేశామనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్‌గా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అభివర్ణించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది సరస్వతి పవర్‌ షేర్లను కాదని.. రూ. 32 కోట్ల విలువ చేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమేనని బుధవారం ఓ ప్రకటనలో షర్మిల వెల్లడించారు. షేర్ల బదలాయింపులో ఎలాంటి ఆంక్షలూ.. అభ్యంతరాలూ లేవన్నారు. స్టేట్‌సకో ఉన్నది షేర్ల మీద కాదన్నారు. గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసినప్పటికీ వాటి షేర్లు బదిలీ కాకుండా ఆపలేదన్నారు. 2016లో భూములను ఈడీ అటాచ్‌ చేసినందువల్ల షేర్లను బదిలీ చేయకూడదని జగన్‌ వింతగా చెప్పడం హాస్యాస్పదమన్నారు. 2019లో తనకు 100 శాతం వాటాలను బదలాయిస్తానంటూ ఎంఓయూ మీద సంతకం చేశాక.. ఇప్పుడు బెయిల్‌ కుట్ర కథలు చెప్పడం ఏమిటని నిలదీశారు. ఎంఓయూ మీద సంతకం చేసినప్పుడు బెయిల్‌ రద్దు అవుతుందని జగన్‌కు తెలియదా అని షర్మిల ప్రశ్నించారు. 2021లో సండూర్‌ పవర్‌కు చెందిన షేర్లను అమ్మ విజయలక్ష్మికి రూ. 42 కోట్లకు ఎలా అమ్మారంటూ జగన్‌ను షర్మిల నిలదీశారు. అప్పుడు జగన్‌కు బెయిల్‌ రద్దవుతుందని తెలియదా అని నిలదీశారు. తల్లి విజయలక్ష్మికి ఫోలియా నంబర్లతో సహా రాసి గిఫ్ట్‌ డీడ్‌ ఇచ్చే ముందు బెయిల్‌ రద్దవుతుందని తెలియదా అని ప్రశ్నించారు. ఎన్సీఎల్టీలో కేసు ఉన్నందున షేర్లపై మాట్లాడితే కోర్టు ధిక్కారమవుతుందన్నారు. కొడుకు బెయిల్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని అమ్మకు తెలుసునని షర్మిల చెప్పారు. అమ్మ ఆ లేఖ రాయకపోతే.. ఆ లేఖతో సంబంధం లేదని ఆమె స్వయంగా ఖండించేవారు కదా అని షర్మిల ప్రశ్నించారు.

Updated Date - Oct 31 , 2024 | 05:13 AM