Share News

Tirumala Laddu: వైఎస్ జగన్‌పై బీజేపీ నేత సంచలన కామెంట్స్..

ABN , Publish Date - Sep 20 , 2024 | 03:46 PM

Tirumala Laddu: వైఎస్ జగన్ తిరుమలను వాణిజ్య కేంద్రంగా పరిగణించారు కానీ హిందువుల పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రంగా కాదు అని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. లడ్డూ ప్రసాదంలో వినియోగించే నాణ్యత లేని నెయ్యి వినియోగం వ్యవహారంలో తప్పు చేసిన బాధ్యులను..

Tirumala Laddu: వైఎస్ జగన్‌పై బీజేపీ నేత సంచలన కామెంట్స్..
Lanka Dinakar

Tirumala Laddu: వైఎస్ జగన్ తిరుమలను వాణిజ్య కేంద్రంగా పరిగణించారు కానీ హిందువుల పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రంగా కాదు అని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. లడ్డూ ప్రసాదంలో వినియోగించే నాణ్యత లేని నెయ్యి వినియోగం వ్యవహారంలో తప్పు చేసిన బాధ్యులను తక్షణం అరెస్ట్ చేసి విచారించాలని లంకా దినకర్ డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీ బోర్డు ఆధ్వర్యంలో లడ్డూ ప్రసాదం నాణ్యత గణనీయంగా పడిపోయిన మాట వాస్తవం అన్నారు.


వైఎస్ జగన్ ప్రకటించిన జంబో టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో టీటీడీని హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా, రాజకీయ కేంద్రంగా మార్చారని లంకా దినకర్ విమర్శించారు. సభ్యుల కుదింపు కోసం.. హైకోర్టు సైతం జోక్యం చేసుకుందని గుర్తు చేశారు. 2023 నవంబర్ 27వ తేదీన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో స్వయంగా తాము, తమ పార్టీ నాయకులతో కలిసి TTD బోర్డు ద్వారా జరుగుతున్న అరాచకాలు, నిధుల మళ్లింపునకు సంబంధించిన విషయాలను వెలుగులోకి తెచ్చామన్నారు. అప్పుడు సమాధానం కూడా ఇవ్వకుండా తమ పార్టీ నాయకులపై దాడులకు వైసీపీ ఉసిగొల్పిందన్నారు.


ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. రూ. 350 కి కిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా దొరుకుతుందని లంకా దినకర్ ప్రశ్నించారు. దేశీ ఆవు నెయ్యి అసలు ధర రూ. 3,000 నుంచి రూ. 5,000 వేల వరకు ఉంటుంది. జెర్సీ ఆవు నెయ్యి అసలు ధర రూ. 1,000 నుంచి 1,200 వరకు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో టీటీడీ బోర్డుకు రూ. 320 నుంచి 350 కే కిలో నెయ్యి ఎలా దొరుకుతుందని లంకా దినకర్ ప్రశ్నించారు. ల్యాబ్ రిపోర్టులను పక్కన పెడితే.. ఈ ధరను బట్టే ఇందులో కల్తీ లేదా ఇతర కొవ్వుల కల్తీ జరుగకుండా ఉండనేది తెలిసిపోతుందన్నారు.


వైఎస్‌ జగన్‌కు హిందూ దేవాలయాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపైన స్పష్టమైన అవగాహన లేదని.. కేవలం రాజకీయ అవసరాల కోసం ఇంటి వద్దే తిరుమల సెట్ వేసి బాగా నటించగలరి లంకా దినకర్ విమర్శించారు. జగన్ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారని.. అయినప్పటికీ.. టీటీడీ వ్యవస్థ నిబంధనలను గౌరవించాల్సి ఉంటుందని దినకర్ గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఉన్న సమయంలో క్రిస్టియన్ మిషినరి సంస్థలకు కట్టపెట్టాలని టీటీడీలోని 7 కొండల్లో 3 టీటీడీకి సంబంధించినవి కావు వంటి అంశాలను లేవనెత్తిన విషయాన్ని దినకర్ గుర్తు చేశారు. ఆనాడే టీటీడీలో అరాచకాలకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. లడ్డూ ప్రసాదం తయారీ వస్తువులను సరఫరా చేసే కాంట్రాక్ట్ కేరళకు చెందిన క్రైస్తవ సంస్థకు ఇవ్వజూపి భక్తుల ఆగ్రహానికి గురి అయ్యారన్నారు.


ఇప్పుడు వైఎస్‌ జగన్‌ తన తండ్రి అడుగుజాడలలో హిందూ వ్యవస్థలకు విరుద్ధమైన ఆచరణకు అనుమతించి, వారి అవినీతి అక్రమాలకు తెరలేపారని విమర్శించారు. హదీరాం మఠం భూములను కూడా వైఎస్‌ఆర్‌సీపీ నేతల కబ్జాలో ఉన్నాయని లంరా దినకర్ ఆరోపించారు. టీటీడీ బోర్డు ద్వారా నిధులు మళ్లించి అవినీతికి పాల్పడ్డారని.. లడ్డూ, అన్నప్రసాదాలకు అవసరమైన పదార్థాల సరఫరాలో భారీ అవినీతి జరిగిందన్నారు. ఈ విషయంలో తప్పు చేసిన బాధ్యులను తక్షణం అరెస్ట్ చేసి విచారించాలని బీజేపీ నేత డిమాండ్ చేశారు.


ఇదే సమయంలో వైఎస్ షర్మిల అంశంపైనా లంకా దినకర్ తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ షర్మి కాంగ్రెస్ పంపిన జగన్ ట్రబుల్ షూటర్ అని వ్యాఖ్యానించారు. టీటీడీ, ఇతర దేవాలయాల్లో అన్యమతస్తులను విధుల నుంచి బదిలీ చేయాలని షర్మిల ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. లేదంటే బ్రదర్ అనిల్ కుమార్ అంగీకరించడం లేదా? అని లంకా దినకర్ ప్రశ్నించారు. వైఎస్ ఫ్యామిలీ డ్రామా పతాకస్థాయికి చేరిందని.. తల్లి, పిల్ల కాంగ్రెస్ విలీనంతో ఈ డ్రామాకు తెరపడుతుందన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 03:46 PM