Share News

Chandrababu: సభ హూందాగా నడవాలి.. వెకిలితనం, వెకిలి మాటలకు ఇక స్వస్తి

ABN , Publish Date - Jun 22 , 2024 | 12:04 PM

స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక తరువాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అప్పట్లో పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేట్ కూడా తాక నివ్వనని వైసీపీ నేతలు చేసిన సవాల్‌ను గుర్తు చేశారు. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందని.. వైసిపి వాళ్ళు వై నాట్ 175 అని 11 గెలిచారన్నారు. గత సభ లాంటి సభను తాను ఎన్నడూ చూడలేదన్నారు.

Chandrababu: సభ హూందాగా నడవాలి.. వెకిలితనం, వెకిలి మాటలకు ఇక స్వస్తి

అమరావతి: స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక తరువాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అప్పట్లో పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేట్ కూడా తాక నివ్వనని వైసీపీ నేతలు చేసిన సవాల్‌ను గుర్తు చేశారు. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందని.. వైసిపి వాళ్ళు వై నాట్ 175 అని 11 గెలిచారన్నారు. గత సభ లాంటి సభను తాను ఎన్నడూ చూడలేదన్నారు. తాను 9 సార్లు గెలిచానని.. ఇక్కడ ఉన్న అందరి కంటే సీనియర్‌నని పేర్కొన్నారు. ఈ సభను అత్యంత గౌరవం గా నడపాలని కోరానని చంద్రబాబు తెలిపారు.


ఈ సభలో హుందాతనంతో ముందుకు వెళ్లాలని... వెకిలితనం, వెకిలి మాటలకు ఇక స్వస్తి అని చంద్రబాబు తెలిపారు. చట్ట సభలు విలువ తెలిసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడని పేర్కొన్నారు. అయ్యన్న నాయకత్వంలో సభ హుందాతనం పెరుగుతుందని చంద్రబాబు తెలిపారు. రాజధాని కట్టాలన్నారు. అలాగే పోలవరం నిర్మాణంతో పాటు నదుల అనుసంథానం, పేదల అభివృద్ధి వంటి కార్యక్రమాలు ఈ సభలోనే చేపట్టాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Updated Date - Jun 22 , 2024 | 12:19 PM