ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష.. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..

ABN, Publish Date - Aug 31 , 2024 | 09:24 AM

ఏపీలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులపై అధికారులతో చంద్రబాబు మాట్లాడారు.

అమరావతి: ఏపీలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులపై అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మ్యాన్ హాల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాల జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు అలెర్ట్‌గా ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని చంద్రబాబు సూచించారు. పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని అధికారులకు చంద్రబాబు తెలిపారు.


ఏ ఏ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారంటే..

భారీ వర్షాల నేపథ్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో నిన్నటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎడ తెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నేడు అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సృజన సెలవు ప్రకటించారు. అనకాపల్లి జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా జిల్లాలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ రోజు సెలవు ప్రకటించడం జరిగింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో అంగన్ వాడీ , ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ నాగలక్ష్మి సెలవు ప్రకటించారు. కోనసీమ జిల్లాలోని పాఠశాలలు, కాలేజీలకు కలెక్టర్ మహేష్ సెలవు ప్రకటించారు. విశాఖ జిల్లాలోనూ వర్షం కారణం పాఠశాలలకు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సెలవు ప్రకటించారు.


కుంటముక్కల సమీపంలో విజయవాడ - జగదల్ పూర్ జాతీయ రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. బుడమేరు ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.మైలవరం మండలంలోని దాసుల్లపాలెం, చిలుకూరువారి గూడెం గ్రామాలకు రాకపోకలను బంద్ చేశారు. మైలవరం పట్టణంలోని తారక రామ నగర్‌లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. మైలవరం సమీపంలోని పూరగుట్ట ప్రభుత్వ లే అవుట్‌లో వరద ఉధృతికి రహదారులు కొట్టుకుపోయాయి. తిరువూరు నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంపలగూడెం మండలం తోటమూల-వినగడప మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వరద పోటెత్తడంతో సమీపంలోని 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలచిపోయాయి.

Updated Date - Aug 31 , 2024 | 09:26 AM

Advertising
Advertising