కుక్కల దాడిలో గాయపడ్డ నెమలి
ABN , Publish Date - Jan 31 , 2024 | 12:02 AM
వీధికుక్కల దాడిలో నెమలి గాయపడింది. కుక్కల నుంచి తప్పించుకుని నలగాంపల్లె సమీపంలోని ఎన్‌పీ సురేంద్ర నాయుడు మామిడి తోటలో మంగళవారం స్పృహ కోల్పోయి పడి ఉంది.
బంగారుపాళ్యం, జనవరి 30: వీధికుక్కల దాడిలో నెమలి గాయపడింది. కుక్కల నుంచి తప్పించుకుని నలగాంపల్లె సమీపంలోని ఎన్‌పీ సురేంద్ర నాయుడు మామిడి తోటలో మంగళవారం స్పృహ కోల్పోయి పడి ఉంది. దీనిని గమనించిన ఆ రైతు నెమలికి ప్రథమ చికిత్స అందించారు. ఈయన సమాచారంతో ఎఫ్‌ఎ్‌సవో శివకుమార్ అక్కడికి చేరుకుని నెమలిని చిత్తూరు రేంజ్ ఆఫీసుకు తరలించారు.