AP NEWS: చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత.. కారణమిదే..
ABN, Publish Date - Sep 02 , 2024 | 09:37 PM
చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన వీ.కోటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్రికెట్ బాల్ తెచ్చిన తంట ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో దాడులు ప్రతి దాడులకు దారి తీయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
చిత్తూరు: చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన వీ.కోటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్రికెట్ బాల్ తెచ్చిన తంట ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో దాడులు ప్రతి దాడులకు దారి తీయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. క్రికెట్ ఆడుతూ ఇరు వర్గాల మధ్య జరిగిన చిన్న గొడవ చిలికి చిలికి గాలి వానగా మారింది.
బజారుకెళ్లిస్తున్న ఓ వివాహితపైక్రికెట్ బంతి పడింది. ఇదేమిటని అడిగిన వారి కుటుంబంపై ఓ వర్గీయులు దాడికి తెగబడ్డారు. పరుగులు తీసి ఇంట్లోకి వెళ్లిన వారిపై పదుల సంఖ్యలో వారి ఇంటిపై పడి కత్తులు.. రాడ్డులతో దాడి చేశారు. భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు ఇరువర్గాలు చేరుకున్నాయి.
అదే సమయంలో దారిలో మరోసారి ఇరువర్గాల మధ్య దాడులు ప్రతి దాడులు జరిగాయి..ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసుల విశ్వ ప్రయత్నంచేసిన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఏ క్షణానికి ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది.
Updated Date - Sep 02 , 2024 | 09:37 PM