AP News: యువ నేతలంతా జాగ్రత్తగా ఉండాలి: చంద్రబాబు
ABN , Publish Date - Nov 02 , 2024 | 06:49 PM
టీడీపీ కార్యకర్తలతో సీఎం నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ చరిత్రలోనే రికార్డు స్థాయి విజయం సాధించామని, దీని వెనుక కార్యకర్తల త్యాగాలు ఉన్నాయన్నారు. ఎప్పుడూ రానంత విజయం వచ్చిందంటే.. ప్రజలు ఎంత ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారో అర్థం చేసుకోవాలని సూచించారు.
శ్రీకాకుళం: గెలిచిన యువనేతలందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని, పార్టీ కార్యకర్తలను గౌరవించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచించారు. టీడీపీ జిల్లా కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ చరిత్రలోనే రికార్డు స్థాయి విజయం సాధించామని, దీని వెనుక కార్యకర్తల త్యాగాలు ఉన్నాయన్నారు. ఎప్పుడూ రానంత విజయం వచ్చిందంటే.. ప్రజలు ఎంత ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారో అర్థం చేసుకోవాలని సూచించారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ సహకరించారన్నారు. వారందరి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని చెప్పారు. ప్రజలకు మంచి చేసినంత వరకు ఓటమి ఉండదని తెలిపారు. రాష్ట్ర ప్రజలు 1995 సీబీఎన్‌ను చూస్తారని చెప్పా.. మనస్సాక్షిగా పనిచేస్తానని తెలిపారు.
ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసమే పోరాడామని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ప్రస్తుతం గెలిచిన యువ నేతలంతా జాగ్రత్తగా ఉండాలని, కార్యకర్తలను గౌరవించాలని సూచించారు. త్వరలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని చెప్పారు. కేంద్రంలో ఏ రీజనల్ పార్టీకీ దక్కని గౌరవం మనకు దక్కిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మిత్ర ధర్మం పాటించాలని, జనసేన, బీజేపీని కలుపుకొని పోవాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న సమస్యలు వస్తే పరిష్కరించుకోవాలని చెప్పారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదని.. నేరస్తుల అడ్డా అని తెలిపారు. తాను కక్ష రాజకీయాలు చేయనని.. అలాగే తప్పు చేసినవారిని వదలనంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
అధికారులతో సమీక్ష
విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో శనివారం సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులపై చర్చ జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు.