ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Aug 20 , 2024 | 07:07 PM

పంచాయతీ రాజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు నింపుతామని అన్నారు. పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేస్తామన్నారు. ఒక ఇంటికి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి ఏం అవసరమో గుర్తించి.. ఆ సదుపాయాలను కల్పిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.

CM Chandrababu

అమరావతి, ఆగష్టు 20: పంచాయతీ రాజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు నింపుతామని అన్నారు. పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేస్తామన్నారు. ఒక ఇంటికి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి ఏం అవసరమో గుర్తించి.. ఆ సదుపాయాలను కల్పిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. వచ్చే జనవరి నుంచి జన్మభూమి 2.0 కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామని సీఎం తెలిపారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 990 కోట్లు, జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర వాటా రూ. 500 కోట్లు విడుదల చేస్తామని సీఎం చెప్పారు. కాగా, ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సంబంధిత శాఖా అధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖలో తీసుకుంటున్న నిర్ణయాలు, సంస్కరణలను సీఎంకు వివరించారు డిప్యూటీ సీఎం.


సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధుల భేటీ..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు అందించే విషయమై చర్చించనున్నారు. అమరావతి నిర్మాణానికి రూ. 15వేల కోట్ల నిధులు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకు ప్రతినిధులు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఈ భేటీలో ప్రాథమికంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులు, దశలవారీగా నిధులు విడుదల చేయడంపై చర్చించారు. అలాగే, అమరావతి ప్రాజెక్టులో పనుల పురోగతి, క్షేత్ర స్థాయి పర్యటనలు, భూ సమీకరణ, మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల అంశాలపై చర్చించారు. రాజధాని పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులు, విధాన నిర్ణయాలను ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. కాగా, సీఆర్డీఏ పరిధిలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు. ఈ నెల 27వ తేదీ వరకు ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు పర్యటించనున్నారు.


స్థానిక సంస్థలకు రూ.1,452 కోట్ల నిధులు..

ఇదిలాఉంటే.. స్థానిక సంస్థల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,452 కోట్ల నిధులు విడుదల చేసింది. స్థానిక సంస్థల బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని.. సీఎం చంద్రబాబు సూచనల మేరకు నిధులు విడుదల చేసినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తే.. తాము బలోపేతం చేస్తున్నామన్నారు.


Also Read:

కేటీఆర్‌కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్..!

ఐఏఎస్ ఆమ్రపాలికి కీలక పదవి..

ఐటీలో మరిన్ని కొలువులు..!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 20 , 2024 | 07:07 PM

Advertising
Advertising
<