Share News

CM Chandrababu: ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 07 , 2024 | 06:22 PM

సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan) పూర్తి విభిన్నం. ప్రజలు అధికారం కట్టబెడితే ఐదేళ్లపాటు పరదాల చాటున తిరిగారు వైసీపీ అధినేత. కానీ చంద్రబాబు ఒక ముఖ్యమంత్రిగా ప్రజల మధ్య, ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

CM Chandrababu: ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన సీఎం చంద్రబాబు
Chandrababu

విజయవాడ: సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan) పూర్తి విభిన్నం. ప్రజలు అధికారం కట్టబెడితే ఐదేళ్లపాటు పరదాల చాటున తిరిగారు వైసీపీ అధినేత. కానీ చంద్రబాబు ఒక ముఖ్యమంత్రిగా ప్రజల మధ్య, ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను స్వయంగా తెలుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. విజయవాడలో చేనేత దినోత్సవ వేడుకలు ముగించుకుని ఉండవల్లి వెళ్తూ ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి సీఎం చంద్రబాబు నాయుడు కిందకు దిగారు. బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లును ఆసక్తిగా తిలకించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మరీ చంద్రబాబు మాట్లాడారు. సందర్శకులతో చంద్రబాబు సెల్ఫీలు దిగారు.


కాగా కృష్ణమ్మ జలకళ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా స్వయంగా ముఖ్యమంత్రి తమ దగ్గరకు వచ్చి మాట్లాడడంతో సందర్శకులు ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Updated Date - Aug 07 , 2024 | 06:25 PM