Share News

AP News: నేడు ఏపీలో కలెక్టర్లు, ఎస్పీల సమావేశం

ABN , Publish Date - Aug 05 , 2024 | 07:08 AM

నేడు కలెక్టర్లు, ఎస్పీల సమావేశం జరగనుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. ఉదయం 10 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. సచివాలయంలోని 5 వ బ్లాక్‌లో సమావేశం జరగనుంది.

AP News: నేడు ఏపీలో కలెక్టర్లు, ఎస్పీల సమావేశం

అమరావతి: నేడు కలెక్టర్లు, ఎస్పీల సమావేశం జరగనుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. ఉదయం 10 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. సచివాలయంలోని 5 వ బ్లాక్‌లో సమావేశం జరగనుంది. సాయంత్రం ఎస్పీ లు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రాత్రి 8 గంటల వరకూ సమావేశం జరుగనుంది. పలు కీలక శాఖలపై సమీక్షలు జరుగనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలను ఏపీ సీఎం చంద్రబాబు వివరించనున్నారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యే కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో ముందుగా సీసీఎల్‌ఏజీ జయలక్ష్మి ప్రారంభోపన్యాసం చేశారు. ఆ వెంటనే సమావేశం ఉద్దేశం ఎజెండాను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వివరించనున్నారు. రెవెన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభ వాఖ్యలతో సమావేశం ప్రారంభించారు.


సమావేశాన్ని ఉద్దేశించి ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు 10.30 నుంచి 11 గంటల వరకూ అర్ధగంట పాటు కలెక్టర్లు కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి కీలకోపన్యాసం చేయనున్నారు. అనంతరం విజన్ ఆంధ్రా @2047 డాక్యుమెంటును ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ ప్రెజెంట్ చేయనున్నారు. 11.15 నుంచి 12 గంటల వరకూ ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, ఉద్యానవనం, ఆక్వా, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖ, అడవులు, మైన్స్‌పై ఫోకస్ చేయనున్నారు. 12.10 నుంచి ఒంటిగంట వరకూ సంక్షేమ రంగాలయిన సాంఘిక/గిరిజన, బిసి/ఈడబ్ల్యూఎస్ , మైనార్టీ, మహిళా శిశుసంక్షేమంపై ఫోకస్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తరువాత 2.00 గంటలనుండి 2.15 నిముషాల వరకూ వైద్యరోగ్యం, వాతావరణంలో మార్పులు, 2.15 నుంచి2.30 వరకూ పాఠశాల విద్య, ఉన్నత విద్య, 2.30 నుంచి 2.50 వరకూ మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖలపై ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నారు.


2.50 నుంచి 4. 00 గంటల మధ్య పంచాయితీరాజ్ , గ్రామీనాభివృద్ది, గృహనిర్మాణం, జలవనరులు, పౌర సరఫరాలు, పరిశ్రమలు, మౌళిక సధుపాయలు, విద్యుత్ రంగాలపై ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నారు. సాయంత్రం 4.20 నుంచి 6.30 గంటల వరకూ రెవెన్యూ, ఆబ్కారి, రవాణా, రోడ్లు భవనాలు, ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లు, చేనేత, జౌళి, పర్యటకం, యువజన క్రీడా, శాంతిభద్రతలపై ఫోకస్ చేయనున్నారు. సాయంత్రం 6. 30 నుంచి 6. 45 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్సురెన్స్‌కు హజరైన వారిని ఉద్దేశించి దిశానిర్ధేశం చేయనున్నారు. అనంతరం రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్‌పీ సిసోడియా క్లోజింగ్ రిమార్కులతో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగియనుంది. గత ప్రభుత్వం తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రకటన ద్వారానే ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా నిర్మాణాత్మక నిర్ణయాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రస్తావన, గత ప్రభుత్వ విధ్వంసపాలన పైన ప్రస్తావించే అవకాశం ఉంది.

Updated Date - Aug 05 , 2024 | 07:08 AM