ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీవారిని దర్శించుకున్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌

ABN, Publish Date - Nov 15 , 2024 | 02:09 AM

బాలల దినోత్సవం సందర్భంగా దేశంలోని పిల్లలు ప్రగతి పథంలో నడవాలని, అందరు బాగా చదువుకోవాలని శ్రీవారిని కోరుకున్నట్టు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు.

తిరుమల, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): బాలల దినోత్సవం సందర్భంగా దేశంలోని పిల్లలు ప్రగతి పథంలో నడవాలని, అందరు బాగా చదువుకోవాలని శ్రీవారిని కోరుకున్నట్టు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించడంతో పాటు లడ్డూప్రసాదాలు అందజేశారు. అనంతరం కేజ్రీవాల్‌ ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని ప్రార్థించినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరి సంతోషంగా ఉండాలని, ప్రత్యేకించి ఢిల్లీ ప్రజలంద రూ బాగుండాలని కోరుకున్నట్టు చెప్పారు. అలాగే ఢిల్లీ మంత్రి సత్యేంద్రకుమార్‌ జైన్‌ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated Date - Nov 15 , 2024 | 02:09 AM