Share News

జిల్లాలో 4.03 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి

ABN , Publish Date - Nov 23 , 2024 | 01:20 AM

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 4.03 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని జిల్లా వ్యవసాయ అధికారి ఓలేటి బోసుబాబు తెలిపారు.

జిల్లాలో 4.03 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి

రాయవరం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 4.03 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని జిల్లా వ్యవసాయ అధికారి ఓలేటి బోసుబాబు తెలిపారు. శుక్రవారం సోమేశ్వరం గ్రామంలో ధాన్యం కోనుగోలు కేంద్రం, రైతు సేవా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నెలాఖరు నాటికి లక్ష ఎకరాల్లో వరి కోతలు పూర్తవుతాయని మండపేట, ఆలమూరు, కె.గంగవరం, రాయవరం, రామచంద్రపురం, రావులపాలెం మండలాల్లో 45 వేల ఎకరాల్లో వరికోతలు పూర్తయినట్టు చెప్పారు. బంగాళాఖాతంలో వాయుగుండం హెచ్చరికల నేపథ్యంలో రైతులు త్వరితగతిన వరికోతలు పూర్తి చేయాలని సూచించారు. జిల్లా లో 221 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1.35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. తొలుత రైతుల వద్దకు వెళ్లి ఆయన మాట్లాడారు. జిల్లా వ్యవసాయ అధికారి వెంట ఆలమూ రు సహాయ వ్యవసాయ సంచాలకుడు కె.నాగేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి కె.ప్రభాకర్‌, వ్యవసాయ సహాయకుడు హరిబాబు, ధాన్యం కొనుగోలు సిబ్బంది, రైతులు ఉన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 01:20 AM