2 గంటల్లోనే ముంబయి పయనం
ABN , Publish Date - Nov 19 , 2024 | 01:24 AM
రాజమహేంద్రవరం విమానాశ్రయ అ భివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఇక్కడి నుంచే దేశవ్యాప్త రాకపోకలకు సన్నద్ధం చేస్తు న్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజమహేంద్రవరం విమానాశ్రయ అభివృద్ధికి రూ.250కోట్లు కేటాయించారు. దీంతో విమా నాశ్రయ రూపురేఖలే మారిపోనున్నాయి.
రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్ ఆక్యుపెన్సీ పెంపు
డిసెంబరు 1 నుంచి ముంబయికి..
12 నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు
180 సీటింగ్‌తో విమానాల రాకపోకలు
రాజమహేంద్రవరం, నవంబరు 18(ఆంధ్ర జ్యోతి): రాజమహేంద్రవరం విమానాశ్రయ అ భివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఇక్కడి నుంచే దేశవ్యాప్త రాకపోకలకు సన్నద్ధం చేస్తు న్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజమహేంద్రవరం విమానాశ్రయ అభివృద్ధికి రూ.250కోట్లు కేటాయించారు. దీంతో విమా నాశ్రయ రూపురేఖలే మారిపోనున్నాయి. పను లు పూర్తయ్యేలోపు రాకపోకలను పెంచే యో చనలో ఉన్నారు. ఎక్కడికైనా ఇక్కడి నుంచి వెళ్లేలా విమానాశ్రయాన్ని సన్నద్ధం చేస్తున్నా రు. ఇప్పటివరకూ 72 సీట్లతో విమానాలు న డుస్తున్నాయి. ఇక డిసెంబరు 1 నుంచి 180 సీట్లు ఉన్న ఎయిర్‌బస్సులు రాకపోకలు సాగిం చనున్నాయి. ఇప్పటికే టికెట్లు విక్రయిస్తున్నా రు. 1వతేదీ నుంచి రాజమహేంద్రవరం టు ముంబయికి 180 సీట్లతో రోజుకు రెండు ఇండి గో ఎయిర్‌బస్సులు రాకపోకలు సాగించనున్నా యి. అదే నెల 12వ తేదీనుంచి ఢిల్లీకి రెండు ఇండిగో ఎయిర్‌బస్సులు అటూ తిరుగుతాయి. 1వ తేదీ సాయంత్రం 4.50కి ముంబాయి నుం చి బయలుదేరి 6:45గంటలకు రాజమహేం ద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. రాజ మహేంద్రవరంలో రాత్రి 7.15గంటలకు ఎయిర్ బస్సు బయలుదేరి రాత్రి 9.50 గంటలకు ముంబయి ఎయిర్‌పోర్టుకు చేరుతుంది. మొ త్తం జర్నీ సమయం 2.10 గంటలు. మరో ఎయిర్‌బస్ డిసెంబరు 12న ఢిల్లీలో ఉదయం 7.30 గంటలకు బయలుదేరి 9.45 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరు కుంటుంది. రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు లో ఉదయం 10.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుతుంది. ఈ రెండు ఎయిర్ బస్సుల్లో 180మంది చొప్పున ప్రయాణికులు వెళ్లవచ్చు. ఇప్పటివరకూ రాజమహేంద్రవరంలోని మధు రపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు రోజూ అటూఇటూ 14 సర్వీసులు తిరుగుతు న్నాయి. బెంగళూరుకు అటూ 4 సర్వీసులు ఉ న్నాయి. చెన్నైకు ఒకసారి వెళ్లి వస్తోంది. గతం లో విశాఖనుంచి సర్వీసు ఉండేది. కానీ రోడ్డు మార్గాన 3గంటల్లో వచ్చేస్తుండడంతో ఎక్కువ మంది విమానం ఎక్కడానికి ఇష్టపడడంలేదు. దీంతో అది రద్దయింది. విమాన ప్రయాణికులు పెరిగితే అక్కడినుంచి కూడా మొదలవుతాయి. ఇక విజయవాడ, తిరుపతి ప్రయాణాలకు కొంత సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.