ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొబ్బరి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN, Publish Date - Aug 12 , 2024 | 12:30 AM

కార్మికుల, కర్షకుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పోరాటం సాగించడంలో ట్రేడ్‌ యూనియన్‌ ముందుంటుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్‌ పేర్కొన్నారు.

ముమ్మిడివరం, ఆగస్టు 11: కార్మికుల, కర్షకుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పోరాటం సాగించడంలో ట్రేడ్‌ యూనియన్‌ ముందుంటుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్‌ పేర్కొన్నారు. చినకొత్తలంకలో ఆదివారం గణేష్‌ కొబ్బరికాయల లారీ ఎగుమతి, దిగుమతి జట్టు కూలీ సంఘ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ కొబ్బరి కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలన్నారు. కొబ్బరి ఎగుమతి, దిగుమతి జట్టు సంఘాలకు నూతన వేతనఒప్పందం అమలు చేయాలన్నారు. వ్యాపారులు స్పందించి వారి డిమాండ్లు పరిష్కరించాలన్నారు. లేకపోతే కార్మికులంతా సమ్మె బాట పడతామని హెచ్చరించారు. వేతన ఒప్పందం గడువు ముగిసి ఏడాది దాటినా నూతన వేతన ఒప్పందం అమలు చేయడంలో వ్యాపారులు కాలయాపన చేయడం తగదన్నారు. కొబ్బరి ఎగుమతి, దిగుమతి జట్టు సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా రాయుడు సూర్యనారాయణ, గౌరవాధ్యక్షుడిగా జి.దుర్గాప్రసాద్‌, ఉపాధ్యక్షులుగా జి.అగ్గిరాముడు, జి.తాతారావు, ప్రధాన కార్యదర్శిగా ఆచంట ఆదినారాయణ, సహాయ కార్యదర్శిగా యడ్ల దుర్గాప్రసాద్‌, పచ్చిమాల రమణ కోశాధికారిగా గొల్లపల్లి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులుగా రెడ్డి సత్యనారాయణ, కటికదల సత్యనారాయణ, గుత్తుల నాగబాబు, మధుర వెంకటరమణ, గుత్తుల సత్యనారాయణ ఎన్నికయ్యారు.

Updated Date - Aug 12 , 2024 | 12:30 AM

Advertising
Advertising
<