కార్తీకంలో సందర్శనీయ ప్రాంతం.. ధనమ్మమర్రి..!
ABN , Publish Date - Nov 22 , 2024 | 12:34 AM
అదొక ఆహ్లాదకర ప్రాంతం.. సహపంక్తి భోజనాలకు ఎంతో ప్రసిద్ధిగాంచింది. అక్కడ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ధనమ్మ తల్లిగా ఉంది. గోదావరి వరద నుంచి రక్షించాలని ఆ మర్రిచెట్టు కు భక్తులు ముడుపులు, సంతాన ప్రాప్తికి పసుపు ఊయలలు కడతారు.. కార్తీకంలో విందు, వినోదాలకు నిలయంగా నిలుస్తోంది. అదే మన ధనమ్మమర్రి..!.. ఈ ప్రాంత ప్రత్యేకత గురించి తెలుసుకుందాం..
సహపంక్తి భోజనాలకు ప్రతీతి
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ధనమ్మతల్లి
గోదావరి వరద నుంచి రక్షించాలని ముడుపులు
సంతాన ప్రాప్తికి పసుపు ఊయలలు.. భక్తుల విశ్వాసం
కార్తీక మాసంలో విందు, వినోదాలకు నిలయం
అదొక ఆహ్లాదకర ప్రాంతం.. సహపంక్తి భోజనాలకు ఎంతో ప్రసిద్ధిగాంచింది. అక్కడ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ధనమ్మ తల్లిగా ఉంది. గోదావరి వరద నుంచి రక్షించాలని ఆ మర్రిచెట్టు కు భక్తులు ముడుపులు, సంతాన ప్రాప్తికి పసుపు ఊయలలు కడతారు.. కార్తీకంలో విందు, వినోదాలకు నిలయంగా నిలుస్తోంది. అదే మన ధనమ్మమర్రి..!.. ఈ ప్రాంత ప్రత్యేకత గురించి తెలుసుకుందాం..
గౌతమీ నదీతీరాన వెలసిన ధనమ్మతల్లి
భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, ఆడపడుచులకు ఆరాధ్యదైవంగా నీరాజనాలు అందుకుంటున్న శ్రీధనమ్మతల్లి అమ్మవారికి ఎంతో చరిత్రఉంది. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక, వీధివారిలంక గ్రామాల మధ్య పావన గౌతమీ నదీతీరాన ఒక మర్రి చెట్టు ఉంది. ఈ చెట్టు కిం ద మూడు దశాబ్ధాల క్రితం ధనమ్మతల్లి అమ్మ వారు వెలిసిందని ప్రజల ప్రగాఢ నమ్మకం. ఆనాటినుంచి ఈప్రాంతం ధనమ్మమర్రిగా వాడుకలోకి వచ్చింది.
ఆదివారాల్లో సందర్శకుల తాకిడి
ధనమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఏటా వైశాఖ శుద్ధ ద్వాదశి నుంచి నిర్వహిస్తుంటారు. ఈ జాతరకు కపిలేశ్వరపురం వంశస్థులు అమ్మవారికి సారె, చీరలు పంపడం ఆన వాయితీగా మారింది. యాత్రికులు సమర్పించే కానుకలతోనే నిత్య ధూ ప, దీప నైవేద్యాలు, ఉత్సవ నిర్వ హణ జరుగుతుంది. దివంగత మాజీ కేంద్రమంత్రి ఎస్‌బీపీబీకే సత్యనారాయణ రావు విందులకు వచ్చే సందర్శకుల కోసం మం చి నీటి సౌకర్యం, వంటశాలలు, నామమాత్రపు అద్దెతో వంటసామాగ్రి ఏర్పాటు చేయించారు. కార్తీకమాసంలో ధనమ్మమర్రి భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ప్రతి ఆదివారం సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది.
మర్రిచెట్టు ఊడలతో..
కపిలేశ్వరపురం జమిందారు దివంగత బలుసు బుచ్చి సర్వారాయుడు వంశానికి చెందిన లంక భూమిలో ఈ మర్రిచెట్టు ఊడలతో విస్తరించి ఉంది. యాం త్రికమైన జనజీవనానికి ఆటవిడుపునిచ్చే విం దు, వినోదాలు కాగా వాటికి విడిదిగా ప్రత్యేక ఖ్యాతి నార్జించింది ఈ ధనమ్మమర్రి. ఈ ప్రాం తం ఒకప్పుడు భక్తిప్రపత్తులకు మాత్రమే ఆల వాలంగా ఉండగా ఇప్పుడు అన్నిరకాల విందు, వినోదాలకు నిలయంగా మారింది. ఈ మధ్య కాలంలో ఇక్కడ పలువురు ఆకతాయిలు తీరు ఒక్కోసారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే లా ఉండడంతో పలువురు ఇబ్బంది పడుతు న్నారు. ఇక్కడ వరద గోదావరి నుంచి లంక పంటలను, బాలారిష్టాల నుంచి పిల్లలను రక్షించి పశుసంపద సమృద్ధిగా ఉండాలని అ మ్మవారికి గ్రామస్థులతోపాటు యాత్రికులు ముడుపులు, మొక్కుబడులు చెల్లిస్తుంటారు. సంతాన ప్రాప్తి కలిగించమని పసుపు ఊయ లలు కడతారు. బంధుగణాలతో సహపంక్తి భోజనాలు చేస్తుండడం అనాదిగా సాగుతోంది. అమ్మవారిని దర్శించడానికి లంక గ్రామాలతో పాటు పరిసర మండలాలైన కొత్తపేట, రావుల పాలెం, కపిలేశ్వరపురం, మండపేట, సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.