Share News

రైతులు రబీ సాగుకు సన్నద్ధం కావాలి

ABN , Publish Date - Nov 20 , 2024 | 12:57 AM

రబీ సాగుకు రైతులు సన్నద్ధం కావాలని వచ్చే నెల 15వతేదీలోపు వరి నాట్లు పూర్తిచేసుకోవాలని పి.గన్నవరం ఏడీఏ ఎస్‌జ్వే రామ్మోహనరావు సూచించారు.

  రైతులు రబీ సాగుకు సన్నద్ధం కావాలి

అంబాజీపేట, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): రబీ సాగుకు రైతులు సన్నద్ధం కావాలని వచ్చే నెల 15వతేదీలోపు వరి నాట్లు పూర్తిచేసుకోవాలని పి.గన్నవరం ఏడీఏ ఎస్‌జ్వే రామ్మోహనరావు సూచించారు. రాష్ర్టియక్రిషివికాస్‌ యోజన పథకంలో భాగంగా ఇరుసుమండలో రబీ ముందస్తు సాగుకు సమయాత్తంపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఏవో సీహెచ్‌డీ విజయకుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి జె.మనోహర్‌ మాట్లాడుతూ కోతలు పూర్తన రైతులు నారుమడులు వేసుకోవాలన్నారు. వరి విత్తన ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ కనభరిచి అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను ఎంపిక చేసుకోవాలన్నారు. తెగుళ్లు తట్టుకునే విధంగా ఎంటీయూ 1121ఎంపిక చేసుకుని సాగు చేయాలని సూచించారు. విత్తన శుద్ధికి సూడోమోనస్‌ కిలో విత్తనాలకు 10గ్రాములకు లేదా కార్బండజమ్‌ 3 గ్రాములను కిలో విత్తనానికి కలిపి వేసుకోవాలన్నారు. నారుమడి వేసే సమయంలో రైతులు సస్యరక్షణపై చర్యలు తీసుకోవాలన్నారు. రబీలో అధికంగా ఎరువులు, పురుగులు వాడటం వల్ల పంటకు అనర్ధం కలుగుతుందన్నారు. వ్యవసాయశాఖ సూచించిన విధంగా ఎరువులు, పురుగు మందులను వాడటం ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చునన్నారు. ఏఈవో డి.దుర్గారావు, వీఏఏ ఎస్‌.దుర్గ, రైతులు దంతులూరి సత్యనారాయణరావు, ఆకుల దొరబాబు, మోకాటి నాగేశ్వరరావు, కడలి సత్యనారాయణ, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 12:57 AM