Share News

మత్స్యకారులు ఎదగాలి

ABN , Publish Date - Nov 22 , 2024 | 12:54 AM

మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించిందని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు.ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం కాటన్‌ బ్యా రేజ్‌ సమీపంలో చేపపిల్లలను గోదావరిలో విడుదల చేసి మాట్లాడారు.

మత్స్యకారులు ఎదగాలి
గోదారిలో చేప పిల్లలు విడుదల చేస్తున్న కలెక్టర్‌

మత్స్య సంపదకు మార్కెట్‌

35 లక్షల చేప పిల్లల విడుదల

ఘనంగా మత్స్యకార దినోత్సవం

కలెక్టర్‌ ప్రశాంతి

ధవళేశ్వరం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించిందని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు.ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం కాటన్‌ బ్యా రేజ్‌ సమీపంలో చేపపిల్లలను గోదావరిలో విడుదల చేసి మాట్లాడారు. మత్స్యకారుల జీవనప్రమాణాలు పెంపొందించే దిశగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఆక్వా సంబంధిత పరిశ్రమలు, మత్స్య ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి సారించాలన్నారు. వేటాడిన మత్స్య సంపదకు మెరుగైన మార్కెట్‌ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ రోజు గోదావరిలో విడుదల చేసిన 35 లక్షల చేపపిల్లలు ఆరు నెలల్లో ఎదిగి గోదావరిలో మత్స్యసంపద సమృద్ధిగా లభ్యమవుతుందన్నా రు. మత్స్యకారుల పిల్లలు మత్స్యఆధారిత పరిశ్రమల వైపు దృష్టి సారించాలన్నారు. విదేశాల్లో డ్రైఫిష్‌కు చాలా డిమాండ్‌ ఉందన్నారు.అందుబాటులో ఉన్న సోలార్‌ డ్రై టెక్నాలజీతో డ్రై ఫిష్‌ తయారు చేసి ఎగుమతి చేయాలన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి వి.కృష్ణారావు మాట్లాడుతూవాతావరణ మార్పులతో రోజురోజుకు తగ్గుతున్న మత్స్య సంపదను కాపాడుకోవాలన్నారు. అనం తరం పలువురు మత్స్యకారులను కలెక్టర్‌ ప్రశాం తి సన్మానించారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కాలేజీలో ఎంఎస్‌సీ ఆక్వాకల్చర్‌ చదువుతూ చేప పిల్లల ఉత్పత్తి, పెంపకంపై శిక్షణ పొందిన విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, తహశీల్దార్‌ పీవీకుమార్‌,అధికారులు పాల్గొన్నారు.

తీపర్రుకు ఉత్తమ ఫిషరీస్‌ సొసైటీ అవార్డు

పెరవలి, నవంబరు21(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఫిషరీస్‌ డే సందర్భంగా తీపర్రుకు చెందిన మత్స్యకార సొసైటీకి జిల్లాలో ఉత్తమ సొసైటీగా అవార్డు దక్కింది.ఈ మేరకు రాజమహేంద్రవ రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రశాంతి సొసైటీ అధ్యక్షుడు మల్లాడి రాంబాబు, ఉపాఽధ్యక్షుడు ర్యాలీ శ్రీనివాస్‌లను సత్కరించారు. తీప ర్రుకు చెందిన కూటమి నాయకులు కంటిపూడి సూర్యనారాయణ, సింహాద్రి సత్యనారాయణ, ప్రత్తిపాటి ప్రసాద్‌ కుమార్‌ అభినందించారు.

Updated Date - Nov 22 , 2024 | 12:54 AM