వచ్చే పుష్కరాలకు..ఒకటే ఘాట్
ABN , Publish Date - Nov 20 , 2024 | 01:07 AM
పవిత్రగోదావరి పుష్కరాలు 2027లో రాజమహేంద్రవరం కేంద్రంగా జరుగబోతున్నాయి. వాటికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది.
ఘాట్లు అనుసంధానించే యోచన
2 కి.మీ ఏక ఘాట్‌కు సన్నాహాలు
గత పుష్కర అనుభవాలే కారణం
ప్రతిపాదన దశకూ చేరని ఫైల్
కొవ్వూరు వైపు కానరాని అభివృద్ధి
ఇక అధికారులు దృష్టి పెట్టాల్సిందే
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : పవిత్రగోదావరి పుష్కరాలు 2027లో రాజమహేంద్రవరం కేంద్రంగా జరుగబోతున్నాయి. వాటికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది.ఈ మేరకు ఇప్పటికే రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో కలెక్టర్ ప్రశాంతి ఒక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పుష్కరాల అభివృద్ధి పనులు, రేవులకు ప్రధాన రహదారుల అనుసంధానం తదితర అంశాలపై చర్చించారు. అయితే ఈసారి గోదావరి పుష్కరాలకు సాన్నాల ఘాట్ల అనుసంధానం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధు లు ఆలోచిస్తున్నారు. గత పుష్కరాలకు రాజమహేంద్రవరం వచ్చిన ప్రతి భక్తుడు పుష్కరాలరేవులోనే సాన్నం చేయాలనే తపనతో పెద్ద ఎత్తున పుష్కరాల రేవుకు రావడంతో ప్రమాదం జరిగిన ఘటన విధితమే. ఈ సారి మాత్రం అటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా ప్రతి రేవు పుష్కరాలరేవే అనే నమ్మ కం భకుల్లో కల్పించేందుకు ఘాట్ల అను సం ధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.
2 కి.మీ మేర ఒకటే రేవు..
రాజమహేంద్రవరంలో పుష్కరాల రేవు, కోటిలింగాల రేవులను కలుపుతూ ఒక అతిపెద్ద స్నానాల రేవులను నిర్మించాలనే ఆలోచన అధి కార యంత్రాంగం, రాజమహేంద్రవరం ఎమ్మె ల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉన్నారు. ఈ రెండు రేవులు అనుసంధానం చేస్తే సుమారుగా రేవు పొడవు 2 కి.మీ ఉంటుంది. గతంలో అప్పటి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కోటిలింగాలరేవు నుంచి చింతాలమ్మఘాట్ ,పద్మావతి ఘా ట్లను కలిపి పెద్దఘాట్‌గా నిర్మించారు. ఇప్పుడు ఆదిరెడ్డి వాసు కోటిలింగాలఘాట్ నుంచి పుష్కరాల రేవు వరకు అనుసంధానం చేసి అతిపొడవైన ఘాట్‌ను నిర్మించతలపెట్టినట్టు తెలిసింది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉంది. పుష్కరాలరేవుపై పడే భారీ రద్దీని తగ్గించే యోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గోదావరి గట్టుపై కనకదుర్గమ్మ ఆలయం, శ్రీవెంకటేశ్వర స్వామి ఆల యం వెనుక నుంచి నల్లా చానల్ గ్యాప్ నుంచి శేషయ్యమెట్ట సరిహద్దులు, జలవనరుల శాఖ భవనం, లాహాస్పిన్ హోటల్ వెనుక, రియలన్స్ స్మార్ట్ షాపింగ్ మాల్ వెనుక భాగం గుండా ఈ పుష్కరాల రేవుకు ఘాట్‌ను అసందానం చేస్తారు. సాన్నాల రేవులు ఆధునీకరించే పను లు 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసే విధంగా రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధికా రులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర నుంచి తొలి దఫాగా రూ100 కోట్లు నిధులు కేటాయించారు. ఇంకా నిధులు తీసుకు వచ్చే పనిలో కూటమి ప్రజాప్రతినిధులు నిమగ్నమయ్యారు.2025 జనవరి నుంచి పుష్క ర పనులు ఆరంభమయ్యే ఆవకాశాలున్నాయి.
కొవ్వూరు వైపు చూడాలి..
రాజమహేంద్రవరంలో పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా కొవ్వూరు రేవును విస్తరించాల్సి ఉంది. ఇప్పటికి గోష్పాదక్షేత్రం రేవునే స్నానాలకు వినియోగిస్తారు. ఆ రేవు విస్తీర్ణం కూడా పెంచితే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొవ్వూరు వైపు రేవుల విస్తీర్ణం పెంచడానికి పెద్ద ఇబ్బందికరమైన పరి స్థితులు ఉండవు. అధికారులు ఆ దిశగా కూడా ఆలోచిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.