ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పిడుగుపాటుకు పశువుల కాపరి మృతి

ABN, Publish Date - Mar 21 , 2024 | 01:37 AM

కాకినాడ జిల్లా వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రత్తిపాడు మండలం టి.రాయవరం గ్రామంలో బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై పశువుల కాపరి మృతి చెందగా మరొక యువకుడు గాయపడ్డాడు.

ప్రత్తిపాడు, మార్చి 20: కాకినాడ జిల్లా వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రత్తిపాడు మండలం టి.రాయవరం గ్రామంలో బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై పశువుల కాపరి మృతి చెందగా మరొక యువకుడు గాయపడ్డాడు. రాయవరం గ్రామానికి చెందిన పద్దేటి మహేష్‌(28)నాలుగు గేదెలను మోపుకుంటూ రాయవరం సమీపంలోని వంతెన వద్ద పొలంలో ఉండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అదే క్రమంలో పిడుగు పడటంతో పొలంలో గొడుగుతో పశువులను కాస్తున్న మహేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ సంఘటనకు సమీపంలో రహదారిపై ఉన్న కొండి సత్తిబాబు గాయపడ్డాడు. గ్రామంలో పద్దేటి కృష్ణ, సావిత్రి దంపతుల మూడో కుమారుడు మహేష్‌ ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని సర్పంచ్‌ తటవర్తి సుబ్బారావు, ఎంపీటీసీ రామన్న దొర పరామర్శించి సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. సంఘటనాస్థలాన్ని వీఆర్వో ప్రసాద్‌ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Mar 21 , 2024 | 01:38 AM

Advertising
Advertising