ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా వినతులను త్వరితగతిన పరిష్కరించాలి

ABN, Publish Date - Nov 19 , 2024 | 12:56 AM

పిఠాపురం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి అందిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్‌ కలెక్టరు రాహుల్‌మీనా ఆదేశించారు. పిఠాపురం రథాలపే ట సెంటర్‌లో గల అంబేడ్కర్‌ కమ్యూనిటీ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదికలో ఆయన ప్రజలు

జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా

జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా

పిఠాపురం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి అందిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్‌ కలెక్టరు రాహుల్‌మీనా ఆదేశించారు. పిఠాపురం రథాలపే ట సెంటర్‌లో గల అంబేడ్కర్‌ కమ్యూనిటీ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదికలో ఆయన ప్రజలు నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి సూచనలు ఇచ్చారు. ప్రతీ దరఖాస్తుకు వారికి సంతృప్తికరమూన రీతిలో సమాధానం ఇవ్వాలన్నారు. పరిష్కారంలో ఆలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల నుంచి పలు అంశాలపై 78 అర్జీలు అందాయి. కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్‌ కమిషనరు కనకారావు, తహసీల్దారు గోపాలకృష్ణ, మూడు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

‘సత్వరం చొరవ చూపాలి’

కార్పొరేషన్‌ (కాకినాడ), నవంబరు 18(ఆంధ్ర జ్యోతి): డయల్‌ యువర్‌ కమిషనర్‌, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వరం చొరవ చూపాలని కాకినాడ కమిషనర్‌ భావన ఆదేశించారు. సోమవా రం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు నిర్వహించిన డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యాక్రమానికి కమిషనర్‌ హాజరయ్యారు. సుమారు ఏడుగురు డయల్‌ యువర్‌ కమిషనర్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు వివరించారు. అనం తరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో కమిషనర్‌ ప్రజల నుంచి పలు సమస్యలపై 50 వరకు అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ కెటి సుధాకర్‌, కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ కె.మనోహర్‌, ఎంహెచ్‌ డాక్టర్‌ పృథ్వీచరణ్‌, మేనేజర్‌ శిరీష్‌, ఏడీహెచ్‌ సిరిల్‌, టీపీఆర్వో శైలజ, మెప్మా సిటీ మిషన్‌ మేనేజర్‌ డి.వెంకటరాజు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 12:57 AM