ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక వాట్సాప్ నంబరు
ABN, Publish Date - Nov 20 , 2024 | 12:27 AM
సామర్లకోట, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక వాట్సాప్ నంబరు 7337359375కు వా ట్సాప్ చేసిన కొద్ది గంటల్లోనే ధాన్యాన్ని రైతుల నుంచి సమీపమిల్లులకు తరలించే ప్రక్రియ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే ప్రారంభించామని రైతులు సద్వినియోగం చేసుకోవాల
జేసీ రాహుల్‌మీనా
సామర్లకోట, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక వాట్సాప్ నంబరు 7337359375కు వా ట్సాప్ చేసిన కొద్ది గంటల్లోనే ధాన్యాన్ని రైతుల నుంచి సమీపమిల్లులకు తరలించే ప్రక్రియ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే ప్రారంభించామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్‌మీనా వెల్లడించారు. రైతుకష్టం దళారుల పాలు పేరిట ఆంధ్రజ్యోతిలో నెల 15న కథనం ప్రచురితమైన విషయం విధి తమే. దీంతో స్పందించి జేసీ సవిల్ సప్లయ్ అధి కారులతో కలిసి సామర్లకోట మండలం వేట్ల పాలెంలో రైతులు ఆరబోసిన ధాన్యం రాశులను పరిశీలించి సమీక్షించారు. ఆరబోసిన ధాన్యాన్ని సమీప రైతు సేవాకేంద్రం సిబ్బంది ధాన్యం నమూనాలను తీసుకెళ్లి పరీక్షిస్తారన్నారు. వ్యవ సాయసిబ్బంది కూపన్లు జనరేట్ చేసి సమీప రైస్‌మిల్లుకు పంపుతారని, ఈ ప్రక్రియ పూర్తయి న తర్వాత రైతు బయోమెట్రిక్ ద్వారా ఎఫ్‌టీవో ఇవ్వడం జరుగుతేందన్నారు. జీపీఎస్ ఫిక్స్ చేసి న వాహనాల ద్వారానే ధాన్యం రవాణా జరగా లని సూచించారు. జేసీ పలవురికి రైతుల ధాన్యా న్ని మిల్లులకు తరలించి ట్రక్‌షీట్, ఎఫ్‌టీవోలను అందజేశారు. అనంతరం ఆదిలక్ష్మి రైస్‌మిల్లును సందర్శించారు. జేసీ వెంట సివిల్ సప్లయ్ జిల్లా మేనేజరు ఎండీ నాయక్, సామర్లకోట త హశీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి, మండల వ్యవసాయాధికారిణి ఇమ్మిడిశెట్టి సత్య , డిప్యూటీ తహశీల్దార్ వై.శ్రీనివాస్, వీఆర్వోలు మామిడాల కామరాజు, కెవీవీ.సత్యనారాయణ పాల్గొన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 12:27 AM