ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిరుపేదల అభ్యున్నతికి తోడ్పాటు

ABN, Publish Date - Nov 18 , 2024 | 12:20 AM

సర్పవరం జంక్షన్‌, నవంబరు 17 (ఆంధ్ర జ్యోతి): కాపు సామాజిక వర్గంలో ఉన్న నిరుపేదల అభ్యున్నకి తోడ్పాటు అందించాలని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. ఆదివారం పెనుమర్తి మామిడితోటలో రాయుడుపాలెంకు చెందిన శ్రీబాల గణపతి కార్తీక మాస కాపు 7వవనసమా

ఎమ్మెల్యే నానాజీకి జ్ఞాపిక అందజేస్తున్న శ్రీబాల గణపతి సేవా సంఘం సభ్యులు

కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే నానాజీ

సర్పవరం జంక్షన్‌, నవంబరు 17 (ఆంధ్ర జ్యోతి): కాపు సామాజిక వర్గంలో ఉన్న నిరుపేదల అభ్యున్నకి తోడ్పాటు అందించాలని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. ఆదివారం పెనుమర్తి మామిడితోటలో రాయుడుపాలెంకు చెందిన శ్రీబాల గణపతి కార్తీక మాస కాపు 7వవనసమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ కార్తీక వన సమారాధన పేరిట అంతా కలసి మెలసి సమావేశం కావడం, ఒకరి కష్టసుఖాలు మరొకరు పాలు పంచుకోవడం మంచి పరిణామమన్నారు. గణపతి సేవా సంఘం ఆధ్వర్యంలో పిల్లలు, మహిళలకు పలు గేమ్స్‌ నిర్వహించారు. పోటీల్లో రాణించిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో సంఘం అఽధ్యక్ష, కార్యదర్శులు ఉ ప్పులూరి బుల్లయ్య, విజ్జపురెడ్డి ఏసుబాబు, ట్రెజరర్‌ గాది చక్రరావు, అడబాల రత్నప్రసాదరావు, మాదారపు తాతాజీ, పుల్ల శ్రీరాములు ఉన్నారు.

నానాజీకి అభినందనలు

విలీన గ్రామ పంచాయతీల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన కాకినాడ రూరల్‌ ఎమ్మె ల్యే పంతం నానాజీని పలు ప్రజా సంఘాల నాయకులు అభినందలు తెలిపారు. ఆదివారం గొడారిగుంటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రమణయ్యపేట మాజీ సర్పంచ్‌ అడబాల రత్నప్రసాదరావు ఆధ్వర్యంలో పలు ప్రజా సంఘాలు, పౌర సంఘాల సభ్యులు ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలిచ్చి అభినందనలు తెలిపారు. ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్‌లో వి లీనం ప్రతిపాదన చేసి సుమారు 13 ఏళ్లు కావస్తున్నా, 6 విలీన గ్రామ పంచాయతీలు ఎదు ర్కొంటున్న సమస్యలు, సాంకేతిక ఇబ్బందులపై ఏ ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లిన దా ఖలాలు లేవన్నారు. విలీన గ్రామాల తరపున ప్రజల పక్షాన గొంతుక వినిపించిన ఎమ్మెల్యే నానాజీని ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ విలీన గ్రామాల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని, ప్రజల ఆకాంక్షలకు అను గుణంగా విలీన పంచాయతీల భవితవ్యంపై పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

Updated Date - Nov 18 , 2024 | 12:20 AM