Share News

మన్యం అయోధ్య.. తడిక వాగు

ABN , Publish Date - Nov 23 , 2024 | 01:50 AM

తడికవాగు.. మన్యం అయోధ్యగా పిలవబడే చిన్న గిరిజన గ్రామం. ఆ ఊరంతా రామభక్తులే. వారిలో ఏ ఒక్కరు మద్యం సేవించరు. మాంసం ముట్టరు. వేకువనే రామనామస్మరణతో ప్రారం భమై తిరిగి రాత్రి రామజపంతోనే దినచర్య ముగుస్తుంది.

మన్యం అయోధ్య.. తడిక వాగు

  • నిత్యం రామనామ స్మరణే.. ఆ ఊరంతా కాషాయ వస్త్రఽధారులే

  • మద్యం సేవించరు.. మాంసం ముట్టరు

  • తడికవాగు గ్రామం.. రామాలయంలో పూజ.. గ్రామస్తులు

చింతూరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): తడికవాగు.. మన్యం అయోధ్యగా పిలవబడే చిన్న గిరిజన గ్రామం. ఆ ఊరంతా రామభక్తులే. వారిలో ఏ ఒక్కరు మద్యం సేవించరు. మాంసం ముట్టరు. వేకువనే రామనామస్మరణతో ప్రారం భమై తిరిగి రాత్రి రామజపంతోనే దినచర్య ముగుస్తుంది. అంతేకాదు ఏడాది పొడవునా కాషాయ వస్త్రాలనే ధరిస్తుంటారు. నిత్యం ప్రవ హించే తడికవాగు పక్కనే ఆ గ్రామం ఉండ డంతో తడికవాగుగా ఆ గ్రామాన్ని పిలుస్తుం టారు. మండల కేంద్రమైన చింతూరుకు 37 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. వ్యవ సాయమే జీవనోపాధి. మొత్తంగా 13 కుటుం బాలే అక్కడ ఉన్నాయి. వారిది ఓ గిరిజన తెగ. కొన్నేళ్ల కిందటే గ్రామస్తులంతా చిన్న రామమం దిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వేకువనే స్నాన మాచరించి రామమందిరం వద్దకు చేరుకొని పూజలు జరుపుకోవడం ఆనవాయితీ. ఆ తర్వాత భోజనం చేసి వ్యవసాయ పనులకు ఉపక్రమి స్తారు. పొద్దుపోయాక వ్యవసాయ పనులు ము గించుకొని తిరిగి స్నానమాచరించి మరోమారు రామమందిరం వద్దకు చేరుకొని పూజా కార్యక్ర మాలు చేపడతారు. తడికవాగులో ఏ ఒక్కరూ కూడా మాంసం ముట్టరు. మద్యం సేవించరు. నిత్యరామనామ స్మరణలో ఉండడమే అందుకు కారణమంటారు వారు. తామంతా హిందువులే కావడంతో రామనామస్మరణ తప్ప మరో వ్యాప కం తమ దరి చేరదంటారు.

భద్రాద్రికి పాదయాత్ర

ఏడాదిలో ఒక పర్యాయం తెలంగాణలోని భద్రాచలంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచం ద్రస్వామి వారి ఆలయానికి తడికవాగు వాసులు అందరూ పాదయాత్రతో వెళతారు. దాదాపు 107 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తుంటారు.

సహకారంతో రామమందిరం

డొంకరాయి, పొల్లూరు తదితర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు, ఉద్యోగుల సహకారంతో తడికవాగులో ఓ మోస్తరు రామమందిరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టు ‘ఆంధ్రజ్యోతి’కి తడి కవాగు గ్రామస్తులు తెలిపారు. వీరంతా వ్యవ సాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. కాగా తమ గ్రామానికి విద్యుత్‌ సరఫరా లేకపో వడంతో తామంతా చీకటిలోనే మగ్గుతున్నామని, రామమందిర పూజారి బాలరాజు వాపోతున్నా డు. విద్యుత్‌ సరఫరా కల్పించగలిగితే రామ మందిరంలో వెలుగులు నిండేవని, అదే దశలో నిత్యం రామనామస్మరణ మైకు ద్వారా తమ గ్రామమంతా విన్పించేలా ఏర్పాటుచేసుకొనేవా రమని బాలరాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా డు. ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్‌ సౌక ర్యం కల్పించాలని బాలరాజు కోరుతున్నాడు.

- ఆంధ్రజ్యోతి/చింతూరు

Updated Date - Nov 23 , 2024 | 01:50 AM