ముగిసిన నామినేషన్ల ఉపసంహరణలు
ABN , Publish Date - Nov 22 , 2024 | 12:32 AM
ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణలు గురువారం ముగిశాయి. ఒకే ఒక్క అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ చేసు కోగా ఎన్నికలబరిలో ఐదుగురు అభ్యర్థులు నిలి చారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఐదుగురు అభ్యర్థులు
వచ్చేనెల 5న పోలింగ్.. 9న ఓట్ల లెక్కింపు
కలెక్టరేట్(కాకినాడ), నవంబరు 21(ఆంధ్ర జ్యోతి): ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణలు గురువారం ముగిశాయి. ఒకే ఒక్క అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ చేసు కోగా ఎన్నికలబరిలో ఐదుగురు అభ్యర్థులు నిలి చారు. ఎన్నికల బరిలో నిలిచినవారిలో బుర్రా గోపిమూర్తి, గంథం నారాయణ రావు, నామన వెంకటలక్ష్మి, కవల నాగేశ్వరరావు, పులుగు దీపక్ ఉన్నారు. ఇకనుంచి వీరు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవ్వనున్నారు. వచ్చేనెల 5న పోలింగ్ జరగనుంది. 9న కౌంటింగ్ జరగనుంది. దీనికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మొత్తంగా 16,316మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనిలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 614మంది, తూర్పుగోదావరి జిల్లాలో 2893మంది , ఏలూరు జిల్లాలో 2605మంది, కాకినాడ జిల్లాలో 3333 మంది, కోనసీమ జిల్లాలో 3209మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 3662మంది ఓటర్లు ఉన్నారు. ఆరు జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలు ఉండగా, దీనిలో అల్లూరి సీతారామరాజు జిల్లా లో 12, తూర్పుగోదావరి జిల్లాలో 20, ఏలూరు జిల్లాలో 20, కాకినాడ జిల్లాలో 22, కోనసీమ జిల్లాలో 22, పశ్చిమగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.