ఓఎన్జీసీ పరిహారం నిధులు విడుదల
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:59 AM
యానాం నియోజకవర్గంలో ఓఎన్జీసీ నుంచి రావాల్సిన మొత్తం నష్టపరిహారం పూర్తిగా విడుదలైందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు.
యానాం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): యానాం నియోజకవర్గంలో ఓఎన్జీసీ నుంచి రావాల్సిన మొత్తం నష్టపరిహారం పూర్తిగా విడుదలైందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. పుదుచ్చేరిలో ఉన్న మల్లాడి మీడియాతో మాట్లాడారు. సీఎం రంగసామి నేతృత్వంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారని మల్లాడి చెప్పారు. ముఖ్యంగా యానాంలో పెం డింగ్‌లో ఉన్న 231మంది మత్స్యకారులకు నష్ట పరిహారం రూ.6.37కోట్లు ఓఎన్జీసీ సంస్థ ప్రభు త్వ ఖాతాకు జమచేసిందని మల్లాడి వివరిం చారు. చివరి అయిదున్నర నెలలకు సంబంధించి మొత్తం 5,520మంది(5258+231) మత్స్యకారులకు నష్ట పరిహారం 34.91కోట్లు ఓఎన్జీసీ ప్రభుత్వ ఖాతాలో జమచేసిందన్నారు. ఈసందర్భంగా సీఎం రంగసామితో పరిహారానికి సం బంధించి ప్రభుత్వం ఇవ్వలసిన ఎక్స్ఫ్‌ండిచర్ అనుమతి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో బుధవారం సీఎం చాంబర్‌లో ఫైనాన్స్, మత్స్యశాఖ కార్యదర్శి, డైరెక్టర్లతో సీఎం సమావేశం నిర్వ హించారన్నారు. పుదుచ్చేరి గవర్నర్, సీఎంలతో సమావేశమై త్వరలో జరిగే యానాం పర్యటనకు సంబంధించి తేదీలు ఖరారు చేయడం జరిగిం దన్నారు. మత్స్యకారులకు అతిత్వరలోనే పరిహారం పెండింగ్‌తో కలిపి మొత్తం రూ.96కోట్లు అర్హులైన మత్స్యకారులకు ఇస్తామన్నారు. పరిహారం విడుదలపై ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేష్‌కుమార్, ప్రాజెక్టు మేనేజర్ సునీల్‌కుమార్, అధికారులకు యానాం మత్స్యకారుల తరుపున మల్లాడి కృతజ్ఞతలు తెలిపారు.