Share News

బడుగుల బతుకుల్లో షాక్‌!

ABN , Publish Date - Nov 22 , 2024 | 12:53 AM

ప్రమాదాలు చెప్పి రావంటారు.. ఈ మూడు సంఘటనలే అందుకు నిదర్శనం.. ముగ్గురూ బడుగుజీవులే.. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులే.. గురువారం వారి పని వారు చేసుకుంటుం డగా మృత్యువు ఎదురొచ్చింది..

బడుగుల బతుకుల్లో షాక్‌!
దేవరపల్లి మండలం త్యాజంపూడిలో మృతిచెందిన దిలీప్‌కుమార్‌

ప్రమాదాలు చెప్పి రావంటారు.. ఈ మూడు సంఘటనలే అందుకు నిదర్శనం.. ముగ్గురూ బడుగుజీవులే.. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులే.. గురువారం వారి పని వారు చేసుకుంటుం డగా మృత్యువు ఎదురొచ్చింది.. వేర్వేరు ప్రాంతాల్లో విద్యుదాఘా తం ముగ్గురిని బలితీసుకుంది..మూడు కుటుంబాలకు షాక్‌ మిగిల్చింది.. దీంతో ఆయా కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యా రు. ఇక మాకు దిక్కెవరంటూ రోధించారు..

కొబ్బరిమట్టతో కరెంట్‌ తీగలు పైకెత్తితే షాక్‌..

దేవరపల్లి,నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): కొబ్బరి మట్టతో విద్యుత్‌తీగలను పైకెత్తడానికి ప్రయత్నించగా షాక్‌ కొట్టి ఒక వ్యక్తి మృతి చెందాడు. దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామానికి చెందిన యాదల దిలీప్‌కుమార్‌ (32) త్యాజంపూడి నుం చి దేవర పల్లి రైతులకు తన సొంత ట్రాక్టర్‌పై గురువారం గడ్డిని తరలిస్తు న్నాడు.యాదవోలు రోడ్డులో పొలంలోకి వెళుతుండగా విద్యుత్‌ తీగలు కిందకు వేలాడుతూ కనిపిం చాయి.విద్యుత్‌తీగలు గడ్డికి తగిలితే మం టలు చెలరేగే ప్రమాదం ఉందని గుర్తించి కొబ్బరి మట్టతో పైకి ఎత్తేందుకు ప్రయత్నించాడు. దీంతో విద్యుదా ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందినట్టు పోలీసులు తెలి పారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గోపాలపురం ప్రభుత్వా సుపత్రికి తర లించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతదేహాన్ని పట్టుకుని ఇక మాకు దిక్కెవరంటూ భార్యాపిల్లలు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

ఆయిల్‌ ఫాం గెలలు కోసే కత్తి విద్యుత్‌ వైర్లపై పడి..

నల్లజర్ల, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి ఊపిరితీసింది. ఆయిల్‌ ఫాం గెలలు కోసే కత్తి ఆయువు తీసింది. నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామానికి చెందిన సూరిబోయిన బుల్లి య్య ఆయిల్‌ ఫాం తోటలో అదే గ్రామానికి చెందిన కడారి వెంకటేశ్వరరావు(49) గురు వారం ఆయిల్‌ ఫాం గెలలు కోసేందుకు వెళ్లాడు. వెంకటేశ్వరరావు కాళ్ళకు డ్రిప్‌ వైర్లు తగిలి ముందుకు పడే క్రమంలో చేతిలో ఉన్న గెలలు కోసే ఇనుప గెడ కత్తి పైన ఉన్న 11కేవీ విద్యుత్‌ వైర్లపై పడింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు.వెంకటేశ్వరరావుకు భార్య, ఇద్ద రు పిల్లలు ఉన్నారు.కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తాడేపల్లిగూ డెం తరలించినట్టు ఎస్‌ఐ సోమరాజు తెలిపారు

ఇనుప నిచ్చెన ఒరిగి.. విద్యుత్‌ వైర్లపై పడి..

ఉండ్రాజవరం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్‌ వైరుకు నిచ్చెన తగిలి ఒక వ్యక్తి మృతిచెందాడు.కె.సావరం గ్రామంలోని టీచర్స్‌ కాలనీకి చెందిన మాదాసు నాగేంద్ర (35), నెక్కంటి పవన్‌ తణుకులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.గురువారం టీచ ర్స్‌ కాలనీ నుంచి తణుకు ఆసుపత్రికి ఇనుప నిచ్చెన సైకిల్‌పై తీసుకెళుతున్నారు. నిచ్చెన బరువుగా ఉండటంతో భుజంపైకి మార్చుకొంటుండగా నిచ్చెన ఒరిగి పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్‌ వైర్‌కు తగిలింది. దీంతో విద్యు దాఘాతానికి గురై మాదాసు నాగేంద్ర అక్కడిక్కడే మృతిచెందాడు. పవన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందిన నాగేంద్రకు భార్య గాయత్రి, ఏడాదిన్నర పాప ఉన్నారు. చిరు ద్యోగం చేసుకుని జీవనం సాగించే నాగేంద్ర మరణించడంతో భార్య గాయత్రి రోధన చూ పరులను కంటతడిపెట్టించింది. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Nov 22 , 2024 | 12:53 AM