Share News

ఉపాధి పనులపై సోషల్‌ ఆడిట్‌

ABN , Publish Date - Oct 03 , 2024 | 12:09 AM

శంఖవరం, అక్టోబరు 2: గత ఆర్థిక సంవత్సరంలో మండలంలో నిర్వహించిన ఉపాధి పనులపై బుధవారం మండల పరిషత్‌ ఆవరణలో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. ఎంపీపీ పర్వత రాజబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో డ్వామా పీడీ వెంకటలక్ష్మి గ్రామసభలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. 14గ్రామాల్లో జరి

ఉపాధి పనులపై సోషల్‌ ఆడిట్‌
సభలో పాల్గొన్న పీడీ, నాయకులు

శంఖవరం, అక్టోబరు 2: గత ఆర్థిక సంవత్సరంలో మండలంలో నిర్వహించిన ఉపాధి పనులపై బుధవారం మండల పరిషత్‌ ఆవరణలో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. ఎంపీపీ పర్వత రాజబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో డ్వామా పీడీ వెంకటలక్ష్మి గ్రామసభలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. 14గ్రామాల్లో జరిగిన పనుల రికార్డులను పరిశీలించిన డీఆర్‌పీలు వాటినివేదకలను పీడీ ముందు ఉంచారు. సుమారు 782పనులుకుగాను రూ.8కోట్లకు ఆడిట్‌ నిర్వహించారు. రూ.1.66 లక్షల రికవరికీ ఆదేశించారు. కత్తిపూడి, శంఖవరం, నెల్లిపూడి, మండపం గ్రామాలకు చెందిన ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లు స్వచ్ఛందగా రాజీనామా చేయగా ఎస్‌.జగ్గంపేట ఉపాది ఫీల్డ్‌ అసిస్టెంటను సస్పెండ్‌ చేస్తున్నట్టు పీడీ తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీ జగదాంభ, సీనియర్‌ టీడీపీ నేతలు పర్వత సురేష్‌, బద్ది రామారావు, వెన్నా శివ, ఉల్లి వీరభద్రరావు, కీర్తి వెంకటసుభాష్‌, జనసేన నేతలు కరణం సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్‌, మేకల కృష్ణ, బద్ది రమణ, ఓలేటి లక్ష్మీనారాయణ,సర్ణం గోవిందు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2024 | 12:09 AM