Share News

ఆ వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే రాపాక వెనక్కి తీసుకోవాలి

ABN , Publish Date - Nov 20 , 2024 | 01:06 AM

అంతర్వేది గొంది గ్రామంలో అగ్నికుల క్షత్రియ సంఘ సభ్యులు మంగళవారం సమావేశమయ్యారు.

ఆ వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే రాపాక వెనక్కి తీసుకోవాలి

అంతర్వేది, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): అంతర్వేది గొంది గ్రామంలో అగ్నికుల క్షత్రియ సంఘ సభ్యులు మంగళవారం సమావేశమయ్యారు. ఇటీవల ఒక సామాజిక వర్గం నిర్వహించిన కార్తీక వనభోజనాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో కేశవదాసు విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయిస్తున్నట్టు చెప్పడం తగదని అగ్నికుల క్షత్రియుల సంఘం సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ చరిత్రను గుర్తుచేసుకుంటూ ఆలయ ప్రాంగణంలో ఎటువంటి విగ్రహాలు నిర్మించడానికి వీలు లేదని కొల్లు మహాలక్ష్మి అన్నారు. ఆలయంలో ఎటువంటి వివాదాలు సృష్టించకుండా కులాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా చూడాలని మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని అగ్నికుల క్షత్రియుల సంఘం డిమాండు చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని కొల్లు మహాలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో తిరుమాని ఆచార్యులు, పోతాబత్తుల రాంబాబు, కొల్లు రాము, కొల్లు మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 01:06 AM