ఆగిఉన్న లారీని ఢీకొన్న పాల వ్యాన్
ABN , Publish Date - Nov 19 , 2024 | 01:20 AM
కాకినాడ జిల్లా తునిలో హైవేపై రాజుల కొత్తూ రు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ పాల వ్యాన్ డ్రైవర్ ఆగిఉన్న లారీని ఢీకొన్నా డు. లారీ వెనుకభాగంలో క్యాబిన్ ఉండిపోయిం ది. దీంతో డ్రైవర్ అందులో ఇరుక్కుపోయాడు. పెట్రోలింగ్ సిబ్బంది క్రేన్ సహాయంతో అతడ్ని మూడు గంటల తర్వాత బయటకు తీయగలి గారు.
క్యాబిన్‌లో ఇరుక్కొన్న వ్యాన్ డ్రైవర్
క్రేన్ సహాయంతో బయటకు..
కాకినాడ జిల్లా తుని హైవేపై ఘటన
తుని రూరల్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తునిలో హైవేపై రాజుల కొత్తూ రు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ పాల వ్యాన్ డ్రైవర్ ఆగిఉన్న లారీని ఢీకొన్నా డు. లారీ వెనుకభాగంలో క్యాబిన్ ఉండిపోయిం ది. దీంతో డ్రైవర్ అందులో ఇరుక్కుపోయాడు. పెట్రోలింగ్ సిబ్బంది క్రేన్ సహాయంతో అతడ్ని మూడు గంటల తర్వాత బయటకు తీయగలి గారు. దీనికి సంబంధించిన వివరాలివి..
అనకాపల్లి జిల్లా కశింకోటకు చెందిన ఎల్. శ్రీను పాలవ్యాన్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. అ తడు విశాఖపట్నం నుంచి కత్తిపూడి వైపు పాల వ్యాన్‌తో వస్తున్నాడు. తుని హైవేపై రాజుల కొ త్తూరు సమీపంలోకి వచ్చేసరికి నిద్ర మత్తులో ఆగిఉన్న లారీని వెనుకనుంచి బలంగా ఢీకొట్టా డు. ప్రమాద తీవ్రతతో వ్యాన్ నుజ్జునుజ్జు అవ్వ గా డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా అటుగా వె ళ్తున్న వాహనదారులుఅతడ్ని రక్షించేందుకు ప్ర యత్నించినా బయటకి తీయలేకపోయారు. దీం తో పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మూడు గంట లపాటు మృత్యువుతో పోరాడిన శ్రీనును అంబు లెన్స్‌లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. తుని పోలీసులు కేసు నమోదు చేశారు.