ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వీఆర్‌కు రామచంద్రపురం సీఐ

ABN, Publish Date - Nov 23 , 2024 | 01:56 AM

రామచంద్రపురం సీఐ కడియాల అశోక్‌కుమార్‌ను పోలీసు ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపిన ట్టు విశ్వసనీయ సమాచారం. గురువారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపు రం పట్టణంలో ట్రావెలర్స్‌ బంగ్లాలో నిర్వహించిన ఒక సామాజికవర్గ వన సమారాధనలో సీఐ అశోక్‌కుమార్‌ పోలీసు యూనిఫారంతో పాల్గొని ప్రసంగించారు.

  • యూనిఫారంతో సామాజిక కార్తీక వనసమారాధనలో ప్రసంగం

  • వివాదాస్పద ప్రసంగంతో చర్యలు

రామచంద్రపురం(ద్రాక్షారామ), నవంబరు22: రామచంద్రపురం సీఐ కడియాల అశోక్‌కుమార్‌ను పోలీసు ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపిన ట్టు విశ్వసనీయ సమాచారం. గురువారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపు రం పట్టణంలో ట్రావెలర్స్‌ బంగ్లాలో నిర్వహించిన ఒక సామాజికవర్గ వన సమారాధనలో సీఐ అశోక్‌కుమార్‌ పోలీసు యూనిఫారంతో పాల్గొని ప్రసంగించారు. ఇటీవల కాకినాడలో నిర్వహించి న ఓ సామాజిక కార్తీకవన సమారాధనలో స్వల్ప ఘర్షణలు చోటుచేసుకోవడంతో రామచంద్రపురం ట్రావెలర్స్‌ బంగ్లావద్ద పోలీసులతో ముం దస్తుగా బందోబస్తు ఏర్పాటుచేశారు. కార్తీక సమారాధన అనంతరం వేదికపై నాయకులు మాట్లాడుతుండగా సీఐ అశోక్‌కుమార్‌ అక్కడకు వచ్చారు. దీంతో సీఐను ఆహ్వానించారు. ప్రముఖుల ప్రసంగాల అనం తరం సీఐను వేదికపైకి పిలిచి మాట్లాలని కోరడంతో సీఐ అశోక్‌కుమార్‌ ప్రసంగించారు. పోలీసు యూనిఫారం వేసుకున్నాక కులమతాలు ఉండ వని చెబుతూనే తన ప్రసంగం మొదలుపెట్టారు. కృష్ణా జిల్లాలో ఎక్కువ కాలం పనిచేసిన తనకు మంత్రి సుభాష్‌ తనకు రామచంద్రపురంలో మన అనే తత్వంతో సీఐ పనిచేసే అవకాశం కల్పించారని, అందుకు మం త్రి సుభాష్‌కు, నేను నా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తదుపరి తమ సామాజికవర్గం గురించి మాట్లాడుతూ భవిష్యత్తులో గోదావరి జిల్లాలో మనదే పైచేయి అవుతుందన్నా రు. దీంతో పోలీసు అధికారి హోదాలో ఉండి సా మాజికవర్గం గురించి మాట్లాడడం వివాదాస్పద మైంది. సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్‌ కావడంతో పోలీసులు ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉండగా పోలీసు యూనిఫారంలో ఉండి సామాజికవన సమారాధనలో పాల్గొని పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయ డంతో సీఐ అశోక్‌కుమార్‌ను వీఆర్‌కు పంపినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సీఐ అశోక్‌కుమార్‌ తీరుపై రామచంద్రపురం మండలం తాళ్లపొలం సర్పంచ్‌ కట్టా గోవిందు శుక్రవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు హర్షవర్దన్‌కు ఫిర్యాదుచేశారు. ద్రాక్షారామ భీమేశ్వరాలయం సందర్శనకు వచ్చిన కె.హర్షవర్దన్‌కు ఆయన ఫిర్యాదు అందజేశారు. సీఐ కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ గోవిందు పిర్యాదుచేశారు.

వివాదాస్పదంగా సీఐ వైఖరి

సీఐగా బాధ్యతలు తీసుకున్నాక సీఐ అశోక్‌కుమార్‌ వైఖరి తరచూ విమర్శలకు తావిచ్చేవిధం గా మారింది. రామచంద్రపురంలోని ఒక సామా జికవర్గం సంఘం ఎన్నికల వ్యవహారంలో ఒకవ ర్గం వైపు సీఐ మద్దతుగా నిలిచారని మరో వర్గం గుర్రుగా ఉంది. ఆ సామాజిక సంఘం సమావేశాల సందర్భంగా సీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు కూడా వెళ్లాయి.

Updated Date - Nov 23 , 2024 | 01:56 AM