ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నీటి సంఘాలకు గ్రీన్‌సిగ్నల్‌!

ABN, Publish Date - Nov 29 , 2024 | 12:29 AM

రైతాంగం ఎదురుచూపులు ఫలించాయి. నీటి సంఘాల ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. దీంతో జిల్లా రైతాంగంలో సందడి నెల కొంది.

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీరు

ఫలించిన ఎదురుచూపులు

వచ్చే నెల 5న నోటిఫికేషన్‌

18న నీటి సంఘాల ఎన్నికలు

1997 నుంచి కొనసాగింపు

గత వైసీపీలో రద్దుకు యత్నం

కూటమి రాకతో ఎన్నికలు

జిల్లాలో రైతుల ఆనందం

గ్రామాల్లో రాజకీయ వేడి

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

రైతాంగం ఎదురుచూపులు ఫలించాయి. నీటి సంఘాల ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. దీంతో జిల్లా రైతాంగంలో సందడి నెల కొంది. నీటి సంఘాల ఎన్నికల సంబంధించిన వచ్చే నెల 5న నోటిఫికేషన్‌ జారీ కానుంది. 11న డిస్ర్టిబ్యూటరీ కమిటీ ఎన్నికలు,14న ప్రాజెక్టు కమిటీ (పీసీ) ఎన్నికలు జరగనున్నా యి.18న టీసీ సభ్యులు,నీటి సంఘాల ఎన్నికలు జరగ నున్నాయి. నీటి సంఘాలు ఆయకట్టు పరి ధి లోని ఆధునికీకరణ..రైతులకు నీటి సరఫరా తది తర పనులు పర్యవేక్షిస్తాయి..

నాడు చంద్రబాబు అంకురార్పణ

గోదావరి జిల్లాల్లో నీటి సంఘాల ఎన్ని కలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇవి కూడా రాజకీయ ప్రాబల్యాన్ని కలిగి ఉం టాయి. గ్రామ సర్పంచ్‌లు, ఆయా ప్రాంతాల రాజకీయ పెద్దల నుంచి ఎమ్మెల్యేల వరకూ ఈ ఎన్ని కల్లో జోక్యం చేసుకుంటారు. సీఎం నారా చంద్రబాబునాయుడు 1997లో నీటి సంఘా లకు అంకురార్పణ చేశారు. అప్పటిలో ధవళే శ్వరంలో ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌస్‌లో రాష్ట్రస్థాయి సదస్సు పెట్టి.. నీటి సంఘాల ప్రాధాన్యత, వాటి ఎన్నికల గురించి చర్చించారు. అప్పటి వరకూ రైతులకు పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. గ్రా మాల్లో కొందరు పెత్తందార్లు చెప్పినట్టుగా సాగేది. పంటకు కాల్వల ద్వారా నీరు ఇవ్వా లన్నా, కాలువలు, బోదెలు, డ్రెయిన్లు బాగు చేసుకోవాలన్నా ఊరిలో కొందరు పెద్దల ఇష్టా నుసారం సాగేది. రైతుల నుంచి డబ్బులు కూడా వసూలు చేసి నొక్కేసేవారు. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు పక్కదారి పట్టించేసే వారు. డెల్టా సిస్టమ్‌ నిర్వహణ సరిగ్గా ఉండేది కాదు. కానీ చంద్రబాబు ఆలోచన వల్ల నీటి సంఘాలు ఏర్పడిన తర్వాత ఇరిగేషన్‌ ద్వారా నీటి సంఘాలకు కొంత డబ్బు కేటాయించి, ఆయా ప్రాంతాల్లోని కాలువలు, బోదెలు, డ్రెయి న్లు క్లీన్‌ చేయించడం మొదలైంది. కాల్వల తూడు, సిల్ట్‌ తొలగింపు పనులు చేశారు. నీటి సంఘాల ఏర్పాటుతో గ్రామాల్లో అన్ని రైతు వర్గాల్లోనూ చైతన్యం పెరిగింది.1999లో మొదటి ఎన్నికలు జరగ్గా తర్వాత 2002, 2008, 2015లో జరిగాయి. అందులో 2008లో తప్ప మిగతా మూడు సార్లు చంద్రబాబు సీఎంగా ఉండగానే ఎన్నికలు జరిగాయి. గత వైసీపీ ప్రభుత్వం నీటి సంఘాలకు ఎన్నికలే నిర్వహించలేదు. వీటిని రద్దు చేసే యోచన కూడా చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. టీడీపీ ఆధ్వర్యంలోని కూట మి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో నీటి సంఘాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమగోదావరి పరిధిలో ఎన్నికలు జరిగేవి. ప్రస్తుతం జిల్లాల విభజన వల్ల ఏ జిల్లా పరి ధిలో ఆ జిల్లాకే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కానీ తూర్పు, మధ్య డెల్టాలకు ప్రాజెక్టు కమి టీలకు ఎన్నికలు కాకినాడ, అమలాపురం పరి ధిలో జరగనున్నాయి. పశ్చిమ డెల్టాకు పశ్చి మగోదావరి జిల్లా పరిధిలో జరగనున్నాయి.

జిల్లాలో 113 నీటి సంఘాలు..

తూర్పుగోదావరి జిల్లాలో 113 నీటి సం ఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. పుష్కర పంపింగ్‌ స్కీమ్‌, తొర్రిగడ్డ ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. మేజర్‌, మీడియం, మైనర్‌ ఇరిగేషన్‌ పరిధిలో ఎన్నికలు ఉంటాయి. మేజర్‌ ఇరిగేషన్‌ పరిధిలో 6నుంచి 12 టీసీ (ప్రాదేశిక కమిటీ)లు ఉంటాయి. మొదట టీసీలను రైతులు ఎన్నుకుంటారు. టీసీ సభ్యు లు నీటి సంఘాల ప్రెసిడెంట్‌ , ఇతర కమిటీని ఎన్నుకుంటారు.వీరు డిస్ర్టిబ్యూటరీ కమిటీని ఎన్నుకుంటారు.ఈ కమిటీలు జిల్లా స్థాయిలో ప్రాజెక్టు కమిటీని ఎన్నుకుంటారు. ప్రాజెక్ట్‌ కమిటీ ఆధ్వర్యంలో అన్ని పనులు చేస్తారు. జిల్లాలో 18 మండలాలు ఉన్నప్పటికీ, కొవ్వూరు, రాజమహేంద్రవరం అర్బన్‌, తాళ్లపూడి ,చాగల్లు మండలాల్లో నీటి సంఘాల ఎన్నికలకు సం బంధించిన ఆయకట్టు లేదు. అందువల్ల అక్కడ ఎన్నికలు నిర్వహించడంలేదు. ఇక ప్రాజెక్టు కమిటీ,డీసీ సభ్యుల ఎన్నికకు రాజకీయ ప్రాధా న్యత ఉంటుంది. నీటి సంఘాల చైర్మన్ల ఎన్నిక పై గ్రామాల్లో రసవత్తరంగా ఉంటుంది.

Updated Date - Nov 29 , 2024 | 12:29 AM