లాభాల్లేవ్.. నష్టాలే!
ABN , Publish Date - Nov 22 , 2024 | 12:50 AM
మద్యం వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని లైసెన్స్‌దారులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 125 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 4384 దరఖాస్తులు వచ్చాయి.
జిల్లాలో 125 షాపులు
అమ్మకాలు బాగు..బాగు
అయినా తగ్గని నష్టాలు
నెలకూ రూ.5 లక్షల నష్టం
ప్రస్తుతం 10 శాతమే కమీషన్
గెజిట్ మేరకు కమీషన్ ఇవ్వాలి
20 శాతానికి డిమాండ్
మరోవైపు బెల్ట్ షాపుల జోరు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
మద్యం వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని లైసెన్స్‌దారులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 125 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 4384 దరఖాస్తులు వచ్చాయి. సుమారు రూ.87 కోట్ల ఆదాయం వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఒక్కో షాపునకు సుమారుగా 35 దరఖాస్తులు అందాయి. అంటే ఈ లెక్కన ఒక్కో షాపునకు దరఖాస్తు ఫీజు రూపేణా వచ్చిన ఆదాయమే అక్షరాలా రూ.70 లక్షలు. చాలా మంది సిండికేట్‌గా ఏర్పడి 200 నుంచి 300 పైనే దరఖాస్తులు చేశారు. ఒక్కో సిండి కేట్‌కు 10 నుంచి ఐదు షాపులు మాత్రమే ద క్కాయి. దీంతో ప్రస్తుతం మద్యం వ్యాపారంలో భాగస్వాములు పెరిగిపోయారు. దరఖాస్తు ఫీజు రూపేణా చేసిన ఖర్చు కోట్లు దాటింది.ప్రస్తుతం మద్యం అమ్మకాలు బాగానే ఉన్నా లైసెన్స్‌లకు ఫీజు రూపేణా ఖర్చు చేసిన దానితో పోల్చి చూసుకుంటే నష్టాలు వస్తున్నాయి. దీంతో వ్యా పారులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ముందు 20 శాతం కమీషన్ ఇస్తా నని ప్రకటించింది. దీంతో మద్యం వ్యాపారులు పెద్ద ఎత్తున క్యూకట్టారు. ప్రస్తుతం 10 నుంచి 11 శాతమే కమీషన్ రావడంతో నష్టాలు వస్తు న్నాయని.. 20శాతం చేయాలని కోరుతున్నారు. కమీషన్ పూర్తిగా ఇవ్వకపోవడం వల్ల ఒక్కో దుకాణదారు నెలకు రూ.5 లక్షల వంతున నష్టపోతున్నట్టు వాపోతున్నారు.
జిల్లాలో 205 కోట్ల అమ్మకాలు
మద్యం కొత్తపాలసీ ప్రకారం గత నెల 16 నుంచి జిల్లాలో మొత్తం 125 ప్రైవేటు మద్యం దుకాణాలు ఆరంభించిన సంగతి తెలిసిందే. జి ల్లాలో మద్యం డిపోలు రెండు ఉన్నాయి. రాజ మహేంద్రవరంలో డిపో పరిఽధిలో 125 ఉన్నా యి.అందులో రాజమహేంద్రవరం పరిధిలో 74, అంబేడ్కర్ కోనసీమ పరిధిలో 40, ఏజెన్సీ ప్రాం తంలో 11 ఉన్నాయి. మొత్తం 27 బార్లు ఉ న్నా యి. చాగల్లు డిపో పరిధిలో 111 దుకాణాలు , 10 బార్లు ఉన్నాయి.అందులో కొవ్వూరు డివి జన్‌లో 43, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 40, ఏలూరు జిల్లా పరిధిలో 28 దుకాణాలు ఉ న్నా యి.మొత్తం రాజమహేంద్రవరం, చాగల్లు డిపోల పరిధిలో 236 దుకాణాలు ఉన్నాయి. 37 బార్లు ఉన్నాయి. వీటి పరిధిలో అక్టోబరు 16 నుంచి ఈ నెల 21వ తేదీ వరకూ రూ.205 కోట్ల మ ద్యం అమ్ముడైంది. అక్టోబరులో 100 కోట్లు, నవం బరులో ఇప్పటి వరకూ రూ.105 కోట్లు అమ్మ కాలు జరిగాయి. జిల్లాలో షాపులు మొద లైన తర్వాత బార్లలో అమ్మకాలు తగ్గినట్టు చెబు తు న్నారు.మరో వైపు బెల్ట్ షాపుల జోరు పెరి గి నట్టు సమాచారం. దీంతో అధికారులు విస్తృ తంగా దాడులు చేస్తున్నారు.ఇప్పటి వరకూ 80 కేసులు నమోదు చేశారు. సారా కేసులు 8 నమోదు చేశారు.బెల్ట్ షాపుల నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు.
కోర్టుకు 11 మంది లైసెన్స్‌దార్లు
రాజమహేంద్రవరం రూరల్‌లో 7, అర్బన్4 పరిఽధిలో నాలుగు షాపుల లైసెన్స్‌దారులు కోర్టు కెళ్లారు.దీంతో వారికి ఇంకా పర్మినెట్ లైసెన్స్ ఇవ్వలేదు.తాత్కాలిక లైసెన్స్‌లతో నడుస్తున్నాయి. రూరల్ పరిధిలోని దుకాణాలకు అర్బన్ ఏరి యాకు వర్తించే రిటైల్ ఎక్సయిజ్ టాక్స్ ప్రకా రం దుకాణానికి ఏడాదికి రూ.85లక్షలు వం తు న వర్తింపచేసి అధికారులు డబ్బు కట్టిం చుకు న్నారు.కానీ అర్బన్ ఏరియాకు వర్తించే జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రక్కన దుకాణాలు పెట్టుకో వడానికి అనుమతివ్వలేదు. దీంతో తాము రిటైల్ ఎక్సయిజ్ టాక్స్ అర్బన్ ఏరియా ప్రకారమే కడు తున్నాం కాబట్టి తమకు కూడా జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రక్కన దుకాణాలు పెట్టుకోవడానికి అనుమతివ్వాలని కోరుతూ కోర్టుకు వెళ్లారు. అర్బ న్ ఏరియాలో దుకాణదారులు దూరం పరిధి విషయంలో కోర్టు కెళ్లారు.దీంతో మద్యం షాపుల వ్యవహారంలో ఇదో పెద్ద తలనొప్పిగా మారింది.
20 శాతం కమీషన్ ఇవ్వాలని మంత్రికి విన్నపం
కొవ్వూరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : గెజిట్‌లో పొందుపర్చిన విధంగా (లిక్కర్) మద్యం షాపుల లైసెన్సుదారులకు 20 శాతం కమీషన్ అందించాలని ఎక్సయిజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్రను మద్యం షాపుల లైసెన్సుదారుల రాష్ట్ర అసోసియేషన్ నాయకులు కోరారు. రాజధాని అమరావతిలో మద్యం షాపుల లైసెన్సుదారుల రాష్ట్ర అసోసియేషన్ నాయకులు రాయల సుబ్బారావు, ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు మంత్రి కొల్లు రవీంద్రను మర్యాద పూర్వకంగా కలిశారు. మద్యం షాపుల లైసెన్సుదారులకు 20 శాతం కమీషన్ అందజేస్తామని లిక్కర్ పాలసీ గెజిట్‌లో పొందుపర్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3300 మద్యం షాపులకు 90 వేల దరఖాస్తులు వచ్చాయి. సరాసరిన ఒక్కొక్క షాపుకు రూ.60 లక్షలు ఖర్చు అయ్యిందన్నారు. ప్రస్తుతం లైసెన్సుదారులకు 10 శాతం మాత్రమే కమీషన్ అందజేస్తున్నారు. ఖర్చులు కూడా రావడం లేదని తెలిపారు. దీనికి తోడు 2వ విడత కిస్తీ మొదటి నెలకే కట్టించుకున్నారు. గతంలో కిస్తీ చెల్లించడం ఆలస్యమైతే వడ్డీ కట్టించుకునే వారని, ప్రస్తుతం వడ్డీతో పాటు పెనాల్టీ కట్టించుకుంటున్నారన్నారు.గెజిట్‌లో పొందుపర్చిన విధంగా 20 శా తం కమీషన్ అందించాలని కోరారు. కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కొఠారు వెంకట్రావు, నామాన పరమేష్ పాల్గొన్నారు.