ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: ఈ సైకో ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి.. జగన్‌పై చంద్రబాబు విసుర్లు

ABN, Publish Date - May 10 , 2024 | 02:44 PM

రాష్ట్రాన్ని అపహస్యం చేసి.. గంజాయి మయంగా చేశారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు( Nara Chandrababu Naidu) ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దోపిడీ, అరాచకాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. మీరు వేసే ఓటు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటవుతుందని ఉద్ఘాటించారు.

Nara Chandrababu Naidu

ఏలూరు: రాష్ట్రాన్ని అపహస్యం చేసి.. గంజాయి మయంగా చేశారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దోపిడీ, అరాచకాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. మీరు వేసే ఓటు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటవుతుందని ఉద్ఘాటించారు. ఏలూరులో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజాగళం వేదికగా సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.


AP Election 2024: వైసీపీ కోసం.. లూప్‌లైన్‌ ‘వ్యూహం’

సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మీరు వేసే ఓటు ఈ సైకో ప్రభుత్వాన్ని సాగనంపడానికి నాంది పలుకుతుందని చెప్పుకొచ్చారు. నిత్యవసరాలు, కరెంట్, పెట్రోల్, పన్నులను పెంచి మీ కొంపలను ఈ సైకో ముఖ్యమంత్రి గుల్ల చేశారని ఆరోపణలు చేశారు. టీడీపీ హయాంలో క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు ఉంటే.. ఇప్పుడు రూ.200 చేశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.


‘‘ఈ ముఖ్యమంత్రి ఒక అవినీతిపరుడు. ప్రజల కోసం పోరాడుతుంటే నన్ను అక్రమంగా జైల్లో పెట్టారు. మీ జీవితాలు ఈ సైకో వల్ల 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాయి. నేను వచ్చిన తర్వాత 100 రోజుల్లో గంజాయి బ్యాచ్‌పై ఉక్కుపాదం మోపుతా. ఈ పేద బిడ్డలను కాపాడే బాధ్యత నేను తీసుకుంటా. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచి పేద ప్రజలకు పంచుతా. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఇచ్చే బాధ్యత నాది. నా ఎస్టీ, నా బీసీ అని చెప్పి... వారిని చంపేసి జగన్ డోర్ డెలివరీ చేస్తాడు’’ అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Election 2024 : విజన్ X విధ్వంసం.. చంద్రబాబు, జగన్‌కు తేడా ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - May 10 , 2024 | 02:55 PM

Advertising
Advertising