Big Breaking: పోటీ ఎక్కడ్నుంచో స్వయంగా ప్రకటించిన పవన్ కల్యాణ్
ABN, Publish Date - Mar 14 , 2024 | 03:13 PM
Pawan Kalyan: గత కొన్నిరోజులుగా పవన్ పోటీస్థానంపై ఎంత సస్పెన్స్ నెలకొందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇవాళ్టితో సస్పెన్స్‌కు తెరపడింది. కాగా.. పవన్ పిఠాపురం నుంచే పోటీచేస్తారని ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో పెద్ద ఎత్తున ప్రత్యేక కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. గురువారం నాడు తన పోటీస్థానంపై సేనాని అధికారికంగా ప్రకటించారు. గత కొన్నిరోజులుగా పవన్ పోటీస్థానంపై ఎంత సస్పెన్స్ నెలకొందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇవాళ్టితో సస్పెన్స్‌కు తెరపడింది. వాస్తవానికి పవన్ మళ్లీ గాజువాక లేదా భీమవరం నుంచి పోటీచేస్తారని గత కొన్నిరోజులుగా వార్తలు వచ్చాయి. ఓడిన చోటే గెలిచి చూపించాలని సేనాని పట్టుదలతో ఉన్నారని పార్టీ వర్గాలు కూడా చెప్పాయి. సీన్ కట్ చేస్తే.. పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్లు పవన్ స్వయంగా ప్రకటించారు. కాగా.. పవన్ పిఠాపురం నుంచే పోటీచేస్తారని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో పెద్ద ఎత్తున ప్రత్యేక కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.
Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్!
పిఠాపురం నుంచే ఎందుకు..?
పవన్ ముందు భీమవరం, గాజువాక, పిఠాపురం మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ పిఠాపురం నుంచే పోటీ చేయడానికి సేనాని మొగ్గు చూపారు. ఎందుకంటే.. ఈ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు దాదాపు 91 వేలు ఉన్నాయి. ఇక్కడి నుంచి పోటీచేస్తే పవన్ భారీ విజయానికి ఢోకా ఉండదని జనసేన వర్గాల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నుంచి పోటీకి పవన్ సై అన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి పంతం నానాజీని ప్రకటించారు. మరోవైపు.. కాకినాడ ఎంపీ సీటు కూడా దాదాపు జనసేనకే ఖాయమైంది. పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే ఆ ప్రభావంతో కాకినాడ రూరల్, ఎంపీ స్థానం కూడా సునాయాసంగా గెలవచ్చనేది జనసేన వ్యూహంగా ఉంది.
AP Politics: భీమవరంలో పోటీపై మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్!
హెలిప్యాడ్ కూడా..!
రాబోయే ఎన్నికల కోసం జనసేన మొదటి నుంచీ కాకినాడ జిల్లాపైనే ఎక్కువ దృష్టిసారించింది. గతేడాది పవన్ ప్రారంభించిన తొలివిడత వారాహి యాత్ర కూడా ఈ జిల్లా నుంచే ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఠాపురంలో రెండ్రోజులు బసచేసి.. ఇక్కడ పార్టీ ఆఫీసు కూడా ప్రారంభిస్తామని ప్రకటించారు. మరోపక్క కొన్ని రోజుల కిందట పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు వద్ద నాలుగు ఎకరాల్లోని ఓ హెలిప్యాడ్‌ను జనసేన రెండు నెలలకు లీజుకు తీసుకుంది. పిఠాపురం నుంచి పోటీచేసే ఉద్దేశంతోనే ముందుగానే హెలిప్యాడ్‌ను సిద్ధం చేసినట్లు తాజా ప్రకటనతో అర్థమైంది. ఎన్నికల గంట మోగగానే పవన్ పిఠాపురానికి నేరుగా హెలికాప్టర్‌లో వచ్చి నామినేషన్ వేస్తారని.. ప్రచారం కూడా చేస్తారని అంటున్నారు.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 14 , 2024 | 03:28 PM