Pawan Kalyan: రాసిపెట్టుకోండి.. పిఠాపురంలో గెలుస్తున్నా.. అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నా!
ABN , Publish Date - May 03 , 2024 | 10:02 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేతలు పరుగులు తీస్తున్నారు. ఒకే రోజు మూడు, నాలుగు బహిరంగ సభల్లో పార్టీల అధిపతులు, అభ్యర్థులను గెలిపించమని ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం నాడు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు...
నెల్లూరు, ఆంధ్రజ్యోతి మే 03 : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేతలు పరుగులు తీస్తున్నారు. ఒకే రోజు మూడు, నాలుగు బహిరంగ సభల్లో పార్టీల అధిపతులు, అభ్యర్థులను గెలిపించమని ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం నాడు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు కూటమి శ్రేణులు.. ముఖ్యంగా జనసైనికుల్లో ఫుల్ జోష్‌ను నింపాయి. ఈ ఎన్నికల్లో పిఠాపురంలో గెలిచి.. అసెంబ్లీలో అడుగు పెడుతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. సేనాని మాట్లాడుతున్నంత సేపు ఈలలు, కేకలతో పార్టీ శ్రేణులు హోరెత్తించాయి.
ఇంకా ఏం మాట్లాడారంటే..?
‘నేను పెరిగిన నెల్లూరు పెరిగిన భవంతుల మధ్యలో వెతుక్కున్నాను. నా తండ్రి నాకు చిన్నప్పుడే చెప్పారు.. మనం ఏం అవ్వాలనుకుంటే అదే అవుతామని చెప్పారు. ఈ దేశ సంపద జ్ఞాన ఖనిజాలతో నిండిన యువత అని ప్రధానమంత్రికి చెప్పాను. ఒక రాజకీయ నాయకుడికి తరం కోసం ఆలోచించే జ్ఞానం ఉండాలి. జగన్ ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించగలడు. మోదీ సూపర్ పవర్ అవ్వాలని 2047 కోసం ఆలోచిస్తున్న వ్యక్తి. మీకు అండగా ఉండటానికి ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాను. ఈ ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేయలేదు.. ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇవ్వలేదు. రంగులు మార్చడానికి 13 వందల కోట్లు ఖర్చు పెట్టింది. జగన్ ఓటు వెయ్యమని సిద్ధమా..? అని బెదిరిస్తూ అడుగుతాడు.ఇది పుచ్చలపల్లి సుందరయ్య నడిచిన నేల. విప్లవం పుట్టిన నేల.. క్లాస్ వార్ మీద పోరాడిన నేల ఇది. కష్టాలు వచ్చినా జగన్ అమ్మ మొగుడు వచ్చినా ఇక్కడి నుంచి పారిపోము. హక్కుల్ని సాధించుకునేందుకు ఎంతవరకైనా పోరాడుతాం’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
Read Latest National News And Telugu News