ResignJagan: అవ్వా, తాతలకు మద్దతుగా నెటిజన్లు.. ట్రెండింగ్‌లో రిజైన్ జగన్ హ్యాష్ ట్యాగ్
ABN, Publish Date - Apr 05 , 2024 | 06:30 PM
జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయు అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. పెన్షన్ల పంపిణీలో జరిగిన నిర్లక్ష్యంతో 32 మంది వృద్దులు చనిపోయారు. ఆ కుటుంబాలకు ఏం భరోసా ఇస్తావు జగన్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయు అని సోషల్ మీడియా ఎక్స్‌లో నెటిజన్లు పోస్ట్ చేశారు.
అమరావతి: జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్ అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. పెన్షన్ల పంపిణీలో జరిగిన నిర్లక్ష్యంతో 32 మంది వృద్దులు చనిపోయారు. ఆ కుటుంబాలకు ఏం భరోసా ఇస్తావు జగన్ (Jagan).. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్ అని సోషల్ మీడియా ఎక్స్‌లో నెటిజన్లు పోస్ట్ చేశారు. #ResignJagan దేశవ్యాప్తంగా రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఏపీ సీఎం జగన్ (Jagan) వైఖరిని నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.
వివాదం ఏంటంటే..?
ఆంధ్రప్రదేశ్‌లో వృద్దులు, వితంతులకు వాలంటీర్లు ఇంటికొచ్చి పెన్షన్ అందజేసేవారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికి పెన్షన్ ఇచ్చారు. పెన్షన్ ఇచ్చే సమయంలో వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేశారు. దీనిని తెలుగుదేశం పార్టీ అభ్యంతరం తెలిపింది. ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చింది. దాంతో వృద్దులు, వితంతులకు వాలంటీర్ల చేత పెన్షన్ ఇవ్వొద్దని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈసీ తెలిపింది. గ్రామ సచివాలయం వద్దకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు కోరారు. రోజుకు కొంత మందికి పెన్షన్ ఇవ్వడం, మరోసారి తగినన్ని డబ్బులు లేకపోవడం తదితర సమస్యలు వచ్చాయి. ఎండలో గ్రామ సచివాలయానికి వచ్చి, తిరిగి వెళ్లడంతో అలసిపోయిన వృద్దులు 32 మంది చనిపోయారు. ఆ అంశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు, నెటిజన్లు తీవ్రస్థాయిలో తప్పు పట్టారు.
నెటిజన్ల ట్విట్లు
‘సచివాలయానికి డబ్బులు పంపించకుండా, పెన్షన్ల కోసం 34 లక్షల మంది వృద్దులను మండుటెండలోకి తీసుకోచ్చావ్. కనీసం మంచినీళ్లు ఇవ్వలేదు. పోయిన సారి బాబాయ్.. ఈ సారి మా మీద పడ్డాయా నీ కళ్లు.. దిగిపో జగన్. నీ రాజకీయ స్వార్థానికి మా పెన్షన్లే కావాల్సి వచ్చాయా.. దిగిపో జగన్. అవ్వా తాతలకు ఇచ్చే పెన్షన్‌పై జగన్ రెడ్డి శవ రాజకీయం. రాజకీయ లబ్ది కోసం తెలుగుదేశం పార్టీ పెన్షన్లు ఆపిందని ప్రచారం. 15 రోజుల్లో రూ.13 లక్షల కోట్లు ఖజానా నుంచి ఖాళీ. వృద్దులను జగన్ మోసం చేశాడు. 2019లో బాబాయ్ శవం, ఇప్పుడు అవ్వా తాతల శవాలు. మనుషులకు కోపం వస్తే పళ్లు కొరుకుతారు. జగన్‌కి కోపం వస్తే పంటికో శవం చొప్పున 32 మంది కావాల్సిందే. పెన్షన్ పంపిణీలో జగన్ సర్కార్ తీరు ఇది అని’ నెటిజన్లు, తెలుగుదేశం పార్టీ నేతలు పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
AP Election 2024: వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ
చిన్నాన్న కోరిక తీరుస్తున్న షర్మిల
మరిన్ని ఏపీ వార్తల కోసం
Updated Date - Apr 05 , 2024 | 08:10 PM