ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kodalinani: ఏపీలో షర్మిలకు జరిగేది ఇదే.. కొడాలి నాని షాకింగ్ కామెంట్స్..

ABN, Publish Date - Jan 31 , 2024 | 03:09 PM

Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ ప్రాపకం కోసం పాకులాడడం సరికాదన్నారు.

విజయవాడ, జనవరి 31: రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS sharmila) చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని (Former Minister Kodali Nani) ఫైర్ అయ్యారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ ప్రాపకం కోసం పాకులాడడం సరికాదన్నారు. పదిమంది పనికిమాలిన వెధవల్ని వేసుకొని రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటూ తెలంగాణలో పరువు తీసుకున్న షర్మిల.... ఇప్పుడు ఏపీకి వచ్చి అదే పని చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఏం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాట్లాడుతున్న షర్మిల... కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం కూడా లేదన్నారు. ఎంపీగా కూడా గెలుస్తాడో లేదో తెలియని రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) రాష్ట్ర సమస్యలు ఎలా పరిష్కరిస్తారని మాజీ మంత్రి ప్రశ్నించారు.

జీరో పర్సెంట్ ఓట్ల శాతం ఉన్న షర్మిల పార్టీ, ఒక శాతం పర్సెంట్ ఉన్న కాంగ్రెస్‌తో కలిస్తే ఏం జరుగుతుందని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే జగన్‌పై, షర్మిల నిందలు వేస్తున్నారన్నారు. షర్మిల పాదయాత్ర చేసిన 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిందా అని ప్రశ్నించారు. ఓటమి తర్వాత షర్మిల ఎక్కడైనా కనిపించారా?.. 2019 ఎన్నికల్లో ఎక్కడైనా ప్రచారం చేశారా? అని ప్రశ్నలు సంధించారు. గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎప్పుడైనా మాట్లాడిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేని షర్మిల ఇప్పుడొచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. ప్రతి పథకానికి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న జగన్ ప్రభుత్వంపై నిందలు వేయడం దారుణమని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 31 , 2024 | 04:39 PM

Advertising
Advertising