ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హత్యకు గౌతంరెడ్డి మనుషులను పురమాయించారు

ABN, Publish Date - Dec 03 , 2024 | 05:35 AM

‘భూవివాదం శాశ్వత పరిష్కారం కోసం ఉమామహేశ్వరశాస్త్రిని హత్య చేయించేందుకు గౌతంరెడ్డి మనుషులను పురమాయించారు. హత్యాయత్నం అనంతరం నిందితులకు పిటిషనర్‌ వసతి కల్పించారు.

నిందితులకు ఆశ్రయం కల్పించారు

ఆధారాలున్నాయి.. బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేయండి: ఏజీ

కేసు డైరీలోని వివరాలను కౌంటర్‌ రూపంలో మా ముందు ఉంచండి.. ప్రాసిక్యూషన్‌కు హైకోర్టు ఆదేశం

అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘భూవివాదం శాశ్వత పరిష్కారం కోసం ఉమామహేశ్వరశాస్త్రిని హత్య చేయించేందుకు గౌతంరెడ్డి మనుషులను పురమాయించారు. హత్యాయత్నం అనంతరం నిందితులకు పిటిషనర్‌ వసతి కల్పించారు. అందుకు సంబంధించి సాక్ష్యాలు, సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారాలు ఉన్నాయి’ అని అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ సోమవారం హైకోర్టుకు నివేదించారు. ఫోర్జరీ పత్రాలతో తన భూమిని ఆక్రమించడమే కాకుండా, తనను చంపేందుకు ప్రయత్నించారంటూ విజయవాడకు చెందిన గండూరి ఉమామహేశ్వరశాస్త్రి వైసీపీ నేత గౌతంరెడ్డిపై కేసు పెట్టారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ గౌతంరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సోమవారం వ్యాజ్యం విచారణకు రాగా ఏజీ దమ్మాలపాటి తన వాదనలు వినిపించారు. ‘ఉమామహేశ్వరశాస్త్రిని హత్య చేయించేందుకు పిటిషనర్‌ ప్రణాళికాబద్ధంగా వ్యవహారించారు. అందుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. హత్యాయత్నం కేసు నమోదుకు వ్యతిరేకంగా కోర్టు విధులు బహిష్కరించాలని పిటిషనర్‌ పిలుపునిచ్చారు. దీంతో విజయవాడ బార్‌ విధులను బహిష్కరించింది. పిటిషనర్‌ అజ్ఞాతంలో ఉండి కోర్టు విధులను బహిష్కరించేలా చేశారు. పిటిషనర్‌పై ఇప్పటివరకు 32 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐదు కేసుల విచారణ పెండింగ్‌లో ఉంది. పిటిషనర్‌పై ఉన్న రౌడీషీట్‌ను 2023లో ఎత్తివేశారు. దర్యాప్తు కీలక దశలో ఉంది. ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముందస్తు బెయిల్‌ కోరుతూ గౌతంరెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టివేయండి’ అని కోరారు. గౌతంరెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ... ‘పిటిషనర్‌, ఫిర్యాదుదారు మధ్య సివిల్‌ వివాదం నడుస్తోంది. ఫిర్యాదుదారు ఉమామహేశ్వర శాస్త్రి సోదరుడు నుంచి పిటిషనర్‌ భూమిని కొనుగోలు చేశారు. స్థలానికి సంబంధించిన ఒరిజనల్‌ డాక్యుమెంట్స్‌ అన్నీ 2015 నుంచి పిటిషనర్‌ వద్దే ఉన్నాయి. అన్ని అనుమతులు తీసుకొని ఆ స్థలంలో పిటిషనర్‌ నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వంలో వేధింపులు ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వం కూడా వేధింపులు కొనసాగిస్తోంది’ అని తెలిపారు. ఏజీ దమ్మాలపాటి పేర్కొన్న వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కేసు డైరీలో పేర్కొన్న వివరాలను అఫిడవిట్‌ లేదా మెమో రూపంలో కోర్టు ముందు ఉంచాలని ప్రాసిక్యూషన్‌ను ఆదేశించింది. గౌతంరెడ్డి తరఫు రిప్లై వాదనల కోసం విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గౌతంరెడ్డిపై తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నేటివరకు పొడిగించారు.

Updated Date - Dec 03 , 2024 | 05:35 AM