Share News

Breaking News: అదానీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

ABN , First Publish Date - Nov 22 , 2024 | 10:34 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల లైవ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

 Breaking News: అదానీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్
AP Assembly Session

Live News & Update

  • 2024-11-22T18:31:15+05:30

    భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మృతి..

    • ఛత్తీస్‌గడ్: సుకుమా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు హతమయ్యారు.

    • మృతుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు.

    • ఘటనా స్థలంలో ఒక ఏకే47, ఎస్ఎల్ఆర్ 1, ఇన్సాస్ 1, సింగిల్ షాట్ 1, పిస్టల్ 1 స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

  • 2024-11-22T13:36:41+05:30

    అదానీ వ్యవహారంపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

    • అదానీ వ్యవహారంపై శాసనసభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

    • అదానీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి

    • ఏపీ బ్రాండ్‌ను జగన్ దెబ్బ తీశారు

    • భద్రత లేకుంటే పెట్టుబడుతు రావు

    • గత వైసీపీ ప్రభుత్వం బరి తెగించి తప్పులు చేసి.. ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించింది.

    • తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టారు

    • చరిత్రలో ఏ నాయకుడు చేయని తప్పులను సీఎంగా జగన్ చేశారు

  • 2024-11-22T11:08:07+05:30

    పీఏసీ బరినుంచి వైసీపీ ఔట్

    • పీఏసీ బరినుంచి వైసీపీ ఔట్

    • పీఏసీ సభ్యుల ఎన్నికలను వైసీపీ బాయ్‌కాట్ చేస్తోందని ప్రకటించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

  • 2024-11-22T10:34:05+05:30

    ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

    • ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10వ రోజు ప్రారంభం

    • శాసనసభలో కొనసాగుతున్న పీఏసీ ఎన్నిక

    • పీఏసీ ఛైర్మన్ ఎంపిక కోసం తొలిసారి ఎన్నిక

    • వైసీపీకి సంఖ్యా బలం లేకపోవడంతో జనసేనకు పీఏసీ ఛైర్మన్ పదవి

    • ఓటింగ్‌లో పాల్గొనే అంశంపై వైసీపీ సమాలోచనలు

    • ఓటింగ్‌కు దూరంగా ఉండాలనే ఆలోచనలో వైసీపీ