Share News

Guntur: కలకలం సృష్టిస్తోన్న కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన.. అసలేం జరిగిందంటే..

ABN , Publish Date - Nov 22 , 2024 | 06:41 PM

గుంటూరు పట్టణం చుట్టుగుంటకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వంశీ శ్రీనివాస్ దారుణ ఘటనకు పాల్పడ్డారు. ఎస్కార్ట్ వాహనంలో శుక్రవారం మధ్యాహ్నం ఎవ్వరూ లేని సమయంలో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.

Guntur: కలకలం సృష్టిస్తోన్న కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన.. అసలేం జరిగిందంటే..

గుంటూరు: ఓ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. గుంటూరు పట్టణం చుట్టుగుంటకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వంశీ శ్రీనివాస్.. శృంగేరి పీఠాధిపతి ఎస్కార్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం ఎస్కార్ట్ వాహనంలో ఆయన తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకోవడంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


తుపాకీ సౌండ్ విని కారు వద్దకు పరిగెత్తిన తోటి సిబ్బంది అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే వంశీ శ్రీనివాస్ మృతిచెందినట్లు గుర్తించారు. దీంతో మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఘటనపై కేసు నమోదు చేసిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: ఏపీ బ్రాండ్ దెబ్బతీశారు.. జగన్‌ చిట్టా బయటపెట్టిన చంద్రబాబు

Nadendla Manohar: ఆ పథకంపై అనుమానాలొద్దు.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Nov 22 , 2024 | 06:56 PM