CM Chandrababu: ఈగల్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Dec 07 , 2024 | 02:07 PM
ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చి గంజాయి వినియోగాన్ని పూర్తిగా నివారిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బాపట్ల మున్సిపల్ పాఠశాలలో పేరెంట్స్-టీచర్స్ సమావేశం జరిగింది. బాపట్లలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు.పాఠశాల ఆవరణలో విద్యార్థులతో చంద్రబాబు, లోకేష్ మాట్లాడారు.
బాపట్ల జిల్లా: ఈగల్ వ్యవస్థపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈగల్ వ్యవస్థను తీసుకువచ్చి గంజాయి వినియోగాన్ని పూర్తిగా నివారిస్తామని తెలిపారు. బాపట్ల మున్సిపల్ పాఠశాలలో ఇవాళ(శనివారం) పేరెంట్స్-టీచర్స్ సమావేశం జరిగింది. బాపట్లలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులతో చంద్రబాబు, లోకేష్ మాట్లాడారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో చంద్రబాబు, లోకేష్ ముఖామఖి నిర్వహించారు.
ఎలక్ట్రానిక్ డివైసెస్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.సైబర్ నేరగాళ్లు చాలా మంది తయారయ్యారని వారి చర్యలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. మాయమాటలతో స్నేహం పేరుతో జీవితాలు నాశనం చేసే స్థాయికు వారు వచ్చారన్నారు. టెక్నాలజీతో మంచితో పాటు చెడు ఉంటుందని గుర్తుంచుకోవాలని అన్నారు. 24 గంటలపాటు ఫోన్ చూడటం వ్యసనం.. అదొక బలహీనత అని చెప్పారు. టీచర్లు, తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్ బారిన పడి జీవితాలను పాడు చేసుకోవద్దని అన్నారు. ఒకసారి డ్రగ్స్ వ్యసనంలో పడితే తిరిగి మామూలు మనిషి కావడం కష్టమన్నారు. ఆ వ్యసనం సర్వనాశనం చేస్తుందని హెచ్చరించారు. గంజాయి కూరగాయల్లా ఇంటి దగ్గరే పండించే స్థాయికి వచ్చారని సీఎం చంద్రబాబు చెప్పారు.
బాపట్ల సభలో చంద్రబాబు మౌనం
బాపట్ల సభలో చంద్రబాబు కొద్దిసేపు మౌనం పాటించారు. దీని వెనుక గొప్ప సంస్కారం ఉంది. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరుగుతుంది. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ విద్యార్థి ప్రసంగించాడు.. ఆ విద్యార్థితో సీఎం మాట్లాడటం ప్రారంభించారు. ఇంతలో మసీదులో నుంచి నమాజ్ ప్రారంభమైంది. వెంటనే సీఎం చంద్రబాబు మౌనం పాటించారు.. అందరూ నిశ్శబ్ధంగా ఉండాలని సూచించారు. నమాజ్ ముగిసిన వెంటనే.. మళ్లీ సీఎం చంద్రబాబు ప్రసంగం ప్రారంభమైంది. మత సంప్రదాయాలను, ధార్మిక ప్రార్థనలను గౌరవించే సీఎం చంద్రబాబు గొప్ప సంస్కారానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ అని అక్కడున్న వారు మాట్లాడుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
YSRCP: వైసీపీ కీలక నేత అరెస్ట్.. ఎందుకంటే
AP High Court : గంజాయి కేసుల్లో ఇదేం తీరు?
CBI : ‘కంటెయినర్‌లో డ్రగ్స్’ కథ కంచికి!?
Read Latest AP News And Telugu News