ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: ‘క్యాంప్ ఆఫీస్ క్లర్క్....రెడ్ హ్యాండెడ్‌గా బుక్’ అంటూ సజ్జలపై ధూళిపాళ్ల సెటైర్

ABN, Publish Date - Feb 13 , 2024 | 05:28 PM

ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను నమోదు చేసి అడ్డంగా బుక్కయ్యారు. ఈ విషయంపై తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar) ఎక్స్(ట్విట్టర్) వేదికగా సెటైరికల్ కామెంట్స్ చేశారు. ‘

అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ(YSRCP) పలు అక్రమాలకు తెరలేపింది. కేంద్ర ఎన్నికల కమిషన్ పలుమార్లు హెచ్చరించిన వైసీపీ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఓటర్ల జాబితాలో అక్రమంగా దొంగ ఓట్లను నమోదు చేస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన అవక తవకలపై ఈసీ చర్యలు తీసుకున్నా కూడా జగన్ పార్టీ మాత్రం దొంగ ఓట్లను భారీగా నమోదు చేస్తూ పట్టుబడుతునే ఉంది. అధికారంలోకి మరోసారి ఎలాగైనా రావాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ నేతలు అనుకున్నదే తడవుగా ఓటర్ల జాబితాలో అవక తవకలకు పాల్పడుతున్నారు.

తాజాగా.. ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను నమోదు చేసి అడ్డంగా బుక్కయ్యారు. ఈ విషయంపై తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar) ఎక్స్(ట్విట్టర్) వేదికగా సెటైరికల్ కామెంట్స్ చేశారు. ‘‘క్యాంప్ ఆఫీస్ క్లర్క్....రెడ్ హ్యాండెడ్‌గా బుక్’’ అయ్యారు. ‘‘రెండు చోట్లా దొంగ ఓట్లతో సలహాల రెడ్డి అడ్డంగా దొరికారు. రెండు ప్రాంతాల్లో రెండు ఓట్లతో క్యాంపు ఆఫీస్ క్లర్కు‌ అడ్డంగా పట్టుబడ్డారు. పొన్నూరులో ఒక ఓటు, మంగళగిరిలో మరో దొంగ ఓటు నమోదు చేశారు’’ అని సజ్జలకు చెందిన ఓట్ల వివరాలను ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ట్విట్ చేశారు.

Updated Date - Feb 13 , 2024 | 05:32 PM

Advertising
Advertising