ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nadendla Manohar: ఆ పథకంపై అనుమానాలొద్దు.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Nov 22 , 2024 | 01:38 PM

ఏపీవ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పథకం అమల్లో ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందుతాయని హామీ ఇచ్చారు.

విజయవాడ: మూడు వారాల్లోనే అద్భుతంగా 50 లక్షల మైలురాయిని దీపం పథకంలో దాటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మహిళల కళ్లల్లో ఆనందం నింపే విధంగా ‌దీపం2 పథకాన్ని సీఎం నారా చంద్రబాబునాయుడు ఇచ్చాపురంలో ప్రారంభించారని గుర్తుచేశారు. కృష్ణలంకలో దీపం పథకం కింద మహిళలకు‌ ఉచిత గ్యాస్ సిలిండర్‌లను ఇవాళ(శుక్రవారం) మంత్రి నాదెండ్ల ‌మనోహర్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కృష్ణలంకలో అందజేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లను కృష్ణలంకలో ఈరోజు మహిళలకు అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల ‌మనోహర్ మాట్లాడుతూ... చంద్రబాబు 1999లోనే దేశంలోనే మొదటిసారిగా మహిళల ఆరోగ్య భద్రత గురించి ఆలోచన చేసి దీపం పథకం అమలు చేశారని.. ఉమ్మడి ఏపీలో గ్యాస్ బండలు ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు కోటి 55 లక్షల 200 గ్యాస్ కనెక్షన్ ఏపీలో ఉన్నాయని వెల్లడించారు.


‘‘ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ బండ అందించే విధంగా నిర్ణయించాం. ఈ‌పథకానికి గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఈ మూడు అంశాలు ప్రాతిపదికనే మేము ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నాం. కావాలనే వైసీపీ నేతలు ఈ పథకంపై అసత్యం ప్రచారం చేస్తున్నారు. మొన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా ఆశ్చర్యంగా కోటి 85 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని ప్రకటించారు. మరి అదనంగా 30 లక్షల గ్యాస్ కనెక్షన్‌లకు ఇంట్లో కూర్చుని బటన్ నొక్కారా. గ్యాస్ కంపెనీల సమాచారం మేరకే కోటి 55 లక్షల 200 కనెక్షన్ మాత్రమే ఉన్నాయి. 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కింద ఇప్పటికే జమ చేశాం. అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాలని మహిళలకు చంద్రబాబు. పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారు. ఇటువంటి పథకాలు ద్వారా ఏపీవ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ పథకం అమల్లో ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందుతాయి. మాకు ఇప్పటివరకు 521 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి అంటే మేము ఎంత పారదర్శకంగా పథకాల అమలు చేస్తున్నామో ప్రజలు అర్థం చేసుకోవాలి. మార్చి 31 2025 వరకు సమయం ఉన్నప్పటికీ మూడు వారాల్లోనే 50 లక్షల మంది ఉచిత గ్యాస్ పథకాన్ని ఉపయోగించుకున్నారు. మా ప్రభుత్వం ప్రజలకు సేవలందించే విషయంలో ఎంత ముందంజలో ఉందో ఆలోచన చేయండి. గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల్లోనే మీ ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత గ్యాస్ అందిస్తాం. ఎవరికీ ఎటువంటి అపోహలు అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


ప్రజల కోసం చాలా సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

ప్రజల కోసం చాలా సంక్షేమ పథకాలను కూటమి‌ ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు. గతంలోనే చంద్రబాబు దీపం పథకాన్ని అమలు చేయగా ఎంతో మంది మహిళలు గ్యాస్ సిలిండర్లు ద్వారానే వంట చేసుకోవటం అలవాటు చేసుకున్నారని చెప్పారు. మహిళలు ఇబ్బందులు పడి అనారోగ్యం బారిన పడటం చంద్రబాబును కలచి వేసిందన్నారు. ఉమ్మడి ఏపీలో 1999లోనే దీపం పథకం అమల్లోకి తెచ్చారని గుర్తుచేశారు. మహిలలకు కట్టెలు లేకుండా గ్యాస్ పొయ్యిలు అందుబాటులోకి తెచ్చి చంద్రన్నగా మారారని ఉద్ఘాటించారు. ఇప్పుడు దీపం 2 పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందించే విధంగా పథకానికి మంచి స్పందన వస్తుందని అన్నారు. 20 రోజుల్లో 50 లక్షల మంది ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారని చెప్పారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన 48 గంటల్లో ఖాతాలో డబ్బులు జామ చేయటం కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనకు నిదర్శనమన్నారు.


నేడు ప్రతి మహిళ ఈ దీపం పథకం కింద ఉచిత గ్యాస్ తీసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరికొకరు సహకరించుకొని కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేయాలనే విధంగా ఆలోచన చేస్తున్నారని అన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా నిధులు కేటాయిస్తూ అడుగులు వేస్తున్నారని తెలిపారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ చేపడుతున్న సంస్కరణలు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తూ ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు ఇచ్చేలా చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. రేషన్ బియ్యం అక్రమాలను అరికట్టడంలో మంత్రి మనోహర్ చేస్తున్న చొరవ కారణంగా ప్రభుత్వానికి ప్రజాధనం కూడా ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు. ఇది ప్రజల ప్రభుత్వం... ఒక మంచి ప్రభుత్వమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.

Updated Date - Nov 22 , 2024 | 01:38 PM